పెట్రోలు పోసుకుని చస్తామన్నారు, బాలయ్య కాంట్రవర్సల్, అందుకే పవర్ స్టార్‌తో: మంజుల ఘట్టమనేని

By Bojja Kumar

సూపర్ స్టార్ కృష్ణ కూతురుగా, మహేష్ బాబు సోదరిగా మంజుల ఘట్టమనేని అందరికీ సుపరిచితమే. ఆమె దర్శకత్వంలో ఇటీవల 'మనసుకుని నచ్చింది' అనే సినిమా వచ్చింది. ఈ సందర్భంగా అలీతో సరదాగా కార్యక్రమంలో పాల్గొన్న మంజుల పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

18 సంవత్సరాల వయసులోనే...

18 సంవత్సరాల వయసులోనే...

దర్శకత్వం వైపు ఎందుకు వచ్చారు అని అలీ అడగ్గా మంజుల సమాధానం ఇస్తూ.... చిన్నతనం నుండి దర్శకత్వం అంటే ఇష్టం, 18 సంవత్సరాల వయసులోనే రప్రసాద్‌ అనే కో-డైరెక్టర్‌ వద్ద నేనూ అన్నయ్య కలిసి దర్శకత్వ పాఠాలు నేర్చుకున్నాం. ఇది ఇప్పుడు వచ్చిన ఆలోచన కాదు, అప్పటి నుండే నా మనసులో ఉంది అని మంజుల తెలిపారు.

Recommended Video

Mahesh Babu Sister Manjula Script For Pawan Kalyan
నా పర్సనల్ లవ్ స్టోరీ కాదు

నా పర్సనల్ లవ్ స్టోరీ కాదు

‘మనసుకు నచ్చింది' కథ మీ పర్సనల్ లవ్ స్టోరీ అంట నిజమేనా? అని అలీ ప్రశ్నించగా.... నిజంకాదు, అంతా మీరే పుట్టిస్తున్నారు. నిత్య పాత్ర నాకు దగ్గరగా ఉంటుందంతే. అంతకు మించి ఏమీ లేదు అని మంజుల తెలిపారు.

బాలకృష్ణ సినిమా సమయంలోనే ఆ గొడవ

బాలకృష్ణ సినిమా సమయంలోనే ఆ గొడవ

బాలకృష్ణ నటించిన ‘టాప్ హీరో' సినిమాలో మొదట మంజులను హీరోయిన్‌ గా ఎంపిక చేశారు. ఈ సినిమా ద్వారా ఆమె హీరోయిన్‌గా పరిచయం కావాల్సి ఉండగా అప్పట్లో పెద్ద గొడవ జరిగింది. దీంతో మంజుల తెరంగ్రేటం ఆగిపోయింది. ఈ విషయమై ఆమె స్పందించారు.

20 ఏళ్ల క్రితం జరిగింది ఇప్పుడు ఎందుకు?

20 ఏళ్ల క్రితం జరిగింది ఇప్పుడు ఎందుకు?

నేను హీరోయిన్‌గా తెరంగ్రేట ప్రయత్నం ఇరవై ఏళ్ల కిందట జరిగింది. ఇపుడు ఆ విషయం ఎందుకు? అంటూనే మంజుల అసలు విషయం చెప్పుకొచ్చారు. అపుడు నాన్నగారి అభిమానులు అడ్డు పడ్డారు అని మంజుల తెలిపారు.

పెట్రోలు పోసుకుని చస్తామన్నారు

పెట్రోలు పోసుకుని చస్తామన్నారు

మా నాన్నగారి అభిమానులు నేను సినిమాల్లో నటించడానికే ఒప్పుకోలేదు. నల్ల ముసుగులు వేసుకొని పెట్రోల్‌ క్యాన్లు పట్టుకుని స్టూడియోకు వచ్చారు. మంజుల హీరోయిన్‍‌గా వచ్చినా, సినిమాల్లో నటించినా తగలబెట్టుకుని చచ్చిపోతాం అని బెదిరించారు. దాంతో నాన్నగారి కోరిక మేరకు నేను నటించిన కావాలనే కోరికను, హీరోయిన్ అవ్వాలనే నిర్ణయాన్ని విమరించుకున్నాను అని మంజుల తెలిపారు.

అందుకే పవన్ కళ్యాణ్‌తో

అందుకే పవన్ కళ్యాణ్‌తో

మీ ఇంట్లో సూపర్ స్టార్లు ఉండగా పవన్ కళ్యాణ్ ఎందుకు సినిమా చేస్తానన్నారు అనే ప్రశ్నకు మంజుల సమాధానం ఇస్తూ... నేను రాసుకున్న కథకు పవన్‌ కళ్యాణ్‌ సరిపోతారు. మహేష్‌బాబు నా మాట వినడు. నేను ఒకలా చేయమంటే తను మరోలా చేస్తాడు. నాన్న, మహేష్ మాదిరిగానే పవన్ కళ్యాన్ కూడా సింపుల్ పర్సలన్. స్టార్‌డమ్‌ అనే గర్వం కనిపించదు. ఆయన మనసుకు నచ్చిందే చేస్తారు. ఆ క్వాలిటీ నాకు బాగా నచ్చింది అని మంజుల తెలిపారు.

బాలయ్య కాంట్రవర్సల్

బాలయ్య కాంట్రవర్సల్

అలీ అడిగిన రాపిడ్ ఫైర్ క్వశ్చన్లకు బాలయ్య గురించి ఒక్క మాటలో చెప్పాలని కోరగా..... ‘కాంట్రవర్సల్' అంటూ మంజుల సమాధానం ఇచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X