సోషల్ మీడియాను కుదిపేస్తున్న రకుల్ ప్రీత్ సింగ్, ఝాన్సీ ముద్దు సీన్!
Recommended Video
నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్ హీరో హీరోయిన్లుగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన 'మన్మధుడు 2' శుక్రవారం గ్రాండ్‌గా విడుదలైంది. సినిమా టాక్ ఎలా ఉందనే సంగతి పక్కన పెడితే ఈ మూవీ గురించిన టాపిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ చిత్రంలో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ముద్దు సీన్ చూసి అంతా ఆశ్చర్యపోయారు. అయితే ఇది హీరో నాగార్జునతో అయితే ఇంతలా హాట్ టాపిక్ అయ్యుండేది కాదు. రకుల్, ఝాన్సీ మధ్య ఈ ముద్దు సీన్ ఉండటంతో ఈ విషయం వైరల్ అవుతోంది. సినిమాలో ఇలాంటి సీన్ ఒకటి ఉంటుందని ప్రేక్షకులు అస్సలు ఊహించలేదు.

వీడియో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న ఫ్యాన్స్
ఈ ముద్దు సీన్ మొబైల్ ఫోన్లో రికార్డ్ చేసిన ఫ్యాన్స్... ట్విట్టర్, ఫేస్ బుక్ లాంటి వాటిల్లో షేర్ చేస్తుండటంతో వైరల్ అవుతోంది. ఈ సీన్ ఏ సందర్భంలో వచ్చిందో తెలియదు కానీ సినిమాలో లెస్బియన్ సీన్లు పెట్టారంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
ఈ సీన్ ప్రభావం సినిమాపై పడుతుందా?
ఒక రకంగా ఈ ముద్దు సీన్ సోషల్ మీడియాను కుదిపేస్తోందనే చెప్పాలి. ఈ సీన్ ఎఫెక్ట్ సినిమాపై పాజిటివ్‌గా ఉంటుందా? లేక నెగెటివ్‌గా ఉంటుందా? అనేది తెలియాలంటే ఫస్ట్ వీకెండ్ పూర్తయితే కానీ చెప్పలేం. కొందరు మాత్రం ఈ సీన్ వల్ల నష్టం జరిగే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

కొందరు చిన్మయిని ఇందులోకి లాగి...
హీరోయిన్‌ను హీరోనే ముద్దు పెట్టుకోవాలా? ఇద్దు ఆడోళ్లు పెట్టుకుంటే తప్పా? మేల్ డామినేషన్ తగ్గాలి.... అంటూ సింగర్ చిన్మయిని ఈ ఇష్యూలోకి లాగి కొందరు కామెంట్స్ చేస్తుండటం గమనార్హం. ఈ సినిమా చిన్మయి భర్త రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్న నేపథ్యంలో వారు ఆమెను టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది.

ట్విట్టర్లో ట్రెడింగ్
ఈ సీన్ ఎఫెక్టుతోనే ‘మన్మధుడు 2' మూవీ ట్విట్టర్లో ట్రెండింగ్‌లోకి వచ్చింది. వేలాదిగా అభిమానులు, సీనీ ప్రేమికులు ఈ అంశంపై స్పందిస్తున్నారు. ఎవరి వాదన ఎలా ఉన్నా.... అటు నాగార్జున పలువురు అమ్మాయిలతో చేసిన ముద్దు సీన్లు, ఇటు రకుల్ ఝాన్సీ ముద్దు సీన్లు కొందరిలో సినిమాపై క్రేజ్ పెంచుతున్నాయనేది నిజం.


Click it and Unblock the Notifications











