Don't Miss!
- News గజలక్ష్మీ యోగం.. నేటినుండి ఈ రాశులవారికి ధనలక్ష్మీ కటాక్షం
- Finance SBI MF: ప్రైవేట్ బ్యాంక్ దెబ్బతో రూ. 1,200 కోట్లకు పైగా నష్టపోయిన ఎస్బీఐ మ్యుచువల్ ఫండ్..
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Technology కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్లను విడుదల చేసిన జియో సినిమా... యాడ్ ఫ్రీ, 4K కంటెంట్ సహా అనేక ప్రయోజనాలు..!
- Lifestyle బీట్రూట్ జ్యూస్ తాగితే ఇన్ని ప్రయోజనాలా..? వారంపాటు తాగితే ఎలాంటి ఫలితముంటుందంటే..?
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్‌లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
నాగ్ ధైర్యానికి కారణమేంటి? టాలీవుడ్లో ఇప్పుడిదే చర్చ
అక్కినేని నాగార్జున తాజాగా నటిస్తున్న చిత్రం 'మన్మథుడు 2'. కే విజయ్ భాస్కర్ దర్శకత్వంలో 2002లో వచ్చిన 'మన్మథుడు'కు ఈ సినిమా కొనసాగింపుగా వస్తోంది. రాహుల్ రవీంద్రన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను మనం ఎంటర్ ప్రైజెస్, ఆనంది ఆర్ట్స్, వయకామ్ 18 స్టూడియోస్ పతాకాలపై నాగార్జున అక్కినేని, పీ కిరణ్ (జెమిని కిరణ్) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో నాగ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తోంది.
ఈ సినిమాకు సంబంధించిన రెండు టీజర్లు ఇప్పటికే విడుదల అయ్యాయి. ఈ రెండింటికీ విశేష స్పందన వచ్చింది. అదే సమయంలో వివాదాలూ చుట్టు ముట్టాయి. ఈ రెండు టీజర్లలో లిప్ కిస్‌లు, రకుల్ సిగరెట్ కాల్చుతున్న సీన్లు ఉండడంతో చాలా మంది వీటిపై విమర్శలు చేశారు. దర్శకుడు రాహుల్ రవీంద్రన్ భార్య చిన్మయిని టార్గెట్ చేస్తూ ట్రోల్ చేశారు. దీంతో 'మన్మథుడు 2' ఈ విధంగానూ చర్చనీయాంశం అయింది.
ఇలాంటి పరిస్థితుల్లో సినిమా విడుదల ఎప్పుడుంటుంది..? ఏమైనా వాయిదా పడే అవకాశాలు ఉన్నాయా..? అనే అనుమానాలు ప్రతి ఒక్కరిలోనూ తలెత్తాయి. వీటన్నింటి పటాపంచలు చేస్తూ చిత్ర హీరో నాగార్జున సోమవారం ఓ పోస్టర్ విడుదల చేశారు. ఇందులో సినిమా రిలీజ్ డేట్‌ను సైతం ప్రకటించారు. దీని ప్రకారం 'మన్మథుడు 2' ఆగస్టు 9న ప్రేక్షకుల ముందుకు రాబోతుందట. ఈ ప్రకటన వెలువడినప్పటి నుంచి టాలీవుడ్లో ఓ చర్చ తెరపైకి వచ్చింది.
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న చిత్రం 'సాహో'. సుజిత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా నాలుగు భాషల్లో రూపొందుతోంది. ఈ సినిమాను స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. ఇంతటి ప్రతిష్టాత్మకమైన సినిమాకు 'మన్మథుడు 2'కు మధ్య వారం రోజుల గ్యాప్ మాత్రమే ఉంది. దీంతో నాగార్జున అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో నాగ్ ఏ ధైర్యంతో పెద్ద సినిమా ముందు విడుదల చేస్తున్నారన్న చర్చ నడుస్తోంది.