twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నాగ్ ధైర్యానికి కారణమేంటి? టాలీవుడ్‌లో ఇప్పుడిదే చర్చ

    |

    అక్కినేని నాగార్జున తాజాగా నటిస్తున్న చిత్రం 'మన్మథుడు 2'. కే విజయ్ భాస్కర్ దర్శకత్వంలో 2002లో వచ్చిన 'మన్మథుడు'కు ఈ సినిమా కొనసాగింపుగా వస్తోంది. రాహుల్ రవీంద్రన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను మనం ఎంటర్‌ ప్రైజెస్‌, ఆనంది ఆర్ట్స్‌, వయకామ్‌ 18 స్టూడియోస్‌ పతాకాలపై నాగార్జున అక్కినేని, పీ కిరణ్‌ (జెమిని కిరణ్‌) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో నాగ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తోంది.

    ఈ సినిమాకు సంబంధించిన రెండు టీజర్లు ఇప్పటికే విడుదల అయ్యాయి. ఈ రెండింటికీ విశేష స్పందన వచ్చింది. అదే సమయంలో వివాదాలూ చుట్టు ముట్టాయి. ఈ రెండు టీజర్లలో లిప్ కిస్‌లు, రకుల్ సిగరెట్ కాల్చుతున్న సీన్లు ఉండడంతో చాలా మంది వీటిపై విమర్శలు చేశారు. దర్శకుడు రాహుల్ రవీంద్రన్ భార్య చిన్మయిని టార్గెట్ చేస్తూ ట్రోల్ చేశారు. దీంతో 'మన్మథుడు 2' ఈ విధంగానూ చర్చనీయాంశం అయింది.

     Manmadhudu 2 Release date Fix.. What Is The Reson Behind This

    ఇలాంటి పరిస్థితుల్లో సినిమా విడుదల ఎప్పుడుంటుంది..? ఏమైనా వాయిదా పడే అవకాశాలు ఉన్నాయా..? అనే అనుమానాలు ప్రతి ఒక్కరిలోనూ తలెత్తాయి. వీటన్నింటి పటాపంచలు చేస్తూ చిత్ర హీరో నాగార్జున సోమవారం ఓ పోస్టర్ విడుదల చేశారు. ఇందులో సినిమా రిలీజ్ డేట్‌ను సైతం ప్రకటించారు. దీని ప్రకారం 'మన్మథుడు 2' ఆగస్టు 9న ప్రేక్షకుల ముందుకు రాబోతుందట. ఈ ప్రకటన వెలువడినప్పటి నుంచి టాలీవుడ్‌లో ఓ చర్చ తెరపైకి వచ్చింది.

    యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న చిత్రం 'సాహో'. సుజిత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా నాలుగు భాషల్లో రూపొందుతోంది. ఈ సినిమాను స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. ఇంతటి ప్రతిష్టాత్మకమైన సినిమాకు 'మన్మథుడు 2'కు మధ్య వారం రోజుల గ్యాప్ మాత్రమే ఉంది. దీంతో నాగార్జున అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో నాగ్ ఏ ధైర్యంతో పెద్ద సినిమా ముందు విడుదల చేస్తున్నారన్న చర్చ నడుస్తోంది.

    English summary
    Senior Hero Nagarjuna decides to release his Manmadhudu 2 in August. He Share One Photo To clarity About This. On, Monday nag annonce Release Date Of Manmadhudu 2.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X