For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

‘మన్మధుడు 2’ వివాదంలో చిన్మయి... యాంటీ సెక్స్ అని చెప్పామా? అంటూ భర్త ఫైర్!

|

నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'మన్మధుడు 2'. ఇటీవల టీజర్ రిలీజ్ తర్వాత ఈ మూవీపై అంచనాలు పెరిగాయి. ఇందులో నాగార్జున... అమ్మాయిలతో సరసాలాడే మన్మధుడిగా కనిపించబోతున్నారు.

రాహుల్ రవీంద్రన్ భార్య, ప్రముఖ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి ఈ టీజర్ తన ట్విట్టర్ ద్వారా షేర్ చేస్తూ చిత్ర బృందానికి గుడ్ లక్ చెప్పారు. అయితే ఈ ట్వీట్ చేసిన వెంటనే చిన్మయిని విమర్శిస్తూ సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి. మహిళల హక్కులు, #మీటూ గురించి మాట్లాడే ఆమె ఆమె.... శృతి మించిన రొమాంటిక్ సీన్లు ఉన్న ఈ టీజర్ షేర్ చేయడం ఏమిటి? అంటూ దూషించడం మొదలు పెట్టారు.

తన భార్యను తిట్టిన వారి నోరు మూయించిన రాహుల్

అయితే తన భార్యను ట్రోల్ చేసిన వారికి సరైన సమాధానం ఇచ్చి వారి నోరు మూయించే ప్రయత్నం చేశాడు రాహుల్ రవీంద్రన్. గతంలో చిన్మయి పలు సందర్భాల్లో రాహుల్ నాకంటే బలమైన ఫెమినిస్ట్(స్త్రీవాది) అని వెల్లడించిన సంగతి తెలిసిందే. చిన్మయికి మద్దతుగా నిలవడటం ద్వారా తాజాగా రాహుల్ ఎంతో మంది హృదయాలను గెలుచుకున్నారు.

మేము యాంటీ సెక్స్ అని చెప్పామా?

‘మన్మధుడు 2' టీజర్ షేర్ చేసిన నా భార్యను చాలా మంది హిప్పోక్రాట్(కపటవేషధారి) అని పిలుస్తున్నారు.... మీ సమస్య ఏమిటి? టీజర్లో ముద్దు సీన్లు ఉండటమేనా? లవ్ మేకింగ్ సీన్లు తీస్తే మహిళలను అవమానించినట్లా? నేను కానీ, చిన్మయి కానీ... మేము యాంటీ సెక్స్ అనే ఫీలింగ్ ఎప్పుడైనా కలిగించామా?.... అంటూ తనదైన శైలిలో రాహుల్ విచుకుపడ్డారు.

వారే హిప్పోక్రట్స్

మన దేశంలో 1.4 బిలియన్ టైమ్స్ సెక్స్ గురించి ఆలోచిస్తారు, చేస్తారు..... కానీ ఎవరూ దాని గురించి ఓపెన్‌గా మాట్లాడటానికి ఇష్టపడరు. నా దృష్టిలో అలాంటి వారే నిజమైన హిప్పెక్రట్స్ (కపటవేషధారులు) అంటూ..... రాహుల్ రవీంద్రన్ తనదైన శైలిలో విరుచుకుపడ్డారు.

మన్మధుడు 2

కింగ్ నాగార్జున‌, ర‌కుల్ ప్రీత్ సింగ్ జంట‌గా న‌టిస్తున్న చిత్రం `మ‌న్మ‌థుడు 2`. రాహుల్ ర‌వీంద్ర‌న్ ద‌ర్శ‌కుడు. మ‌నం ఎంట‌ర్ ప్రైజెస్‌, ఆనంది ఆర్ట్స్‌, వ‌యకామ్ 18 స్టూడియోస్ ప‌తాకాలపై నాగార్జున అక్కినేని, పి.కిర‌ణ్(జెమిని కిర‌ణ్‌) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆగ‌స్ట్ 9న ఈ చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అవుతుంది.

English summary
Rahul Ravindran's wife and playback singer Chinmayi Sripaada shared the Manmadhudu 2 teaser on her Twitter timeline and wished good luck for the team. Little did she realise that a harmless tweet would be bombarded with abuses from trolls. However, Rahul has hit back at the trolls with an epic reply. Many a time, Chinmayi had revealed that Rahul is much more a feminist than her in real life. The director's reply for the trolls has won many hearts on the internet.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more