‘మన్మథుడు 2’ ట్విట్టర్ రివ్యూ.. నాగ్, రకుల్ కెమిస్ట్రీ ఎలా ఉందంటే..

Recommended Video

Manmadhudu 2 Movie Twitter Review | ‘మన్మథుడు 2’ ట్విట్టర్ రివ్యూ!! | Filmibeat Telugu

కొద్దిరోజులుగా సరైన హిట్ పడక ఇబ్బందిగా పడుతున్నాడు టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జున. ఈ క్రమంలో ఎన్నో ప్రయత్నాలు చేసినా అవి సఫలం కాలేదు. ఆయన గత చిత్రాలు సైతం ప్రేక్షకుల మెప్పు పొందలేకపోయాయి. ఈ నేపథ్యంలో ఆయన క్రేజీ కాన్సెప్ట్‌తో చేసిన సినిమానే 'మన్మథుడు 2'. ఇందులో రకుల్ ప్రీత్ సింగ్ ఆయనకు జంటగా నటిస్తోంది. ఫ్రెంచ్ సినిమా ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అంతకంటే ముందే ఓవర్సీస్‌లో ప్రీమియర్స్ పడిపోయాయి. ఈ నేపథ్యంలో కొందరు ట్విట్టర్ ద్వారా సినిమాపై తమ అభిప్రాయాలను వెల్లడించారు. అసలు సినిమా ఎలా ఉంది..? వాళ్లు ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు..? ఎంత రేటింగ్ ఇస్తున్నారు..?

నాగ్ అందం గురించే..

ఈ సినిమా చూసిన వారంతా అక్కినేని నాగార్జున అందం గురించే మాట్లాడుతున్నారు. ఈ సినిమాలో ఆయన 25 ఏళ్ల కుర్రాడిలా కనిపించాడని అంటున్నారు. గతంలో ఎన్నడూ చూడని స్టైలిష్ లుక్‌లో నాగ్ కనిపిస్తున్నారని తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్లే బాయ్‌గా కుర్రాళ్లను మించి రొమాన్స్ చేశాడని చెబుతున్నారు.

డైరెక్టర్‌పై ప్రశంసలు - సంగీతం మాత్రం..

ఇప్పటికే సినిమా చూసిన చాలా మంది నాగార్జున తర్వాత చిత్ర దర్శకుడు రాహుల్ రవీంద్రన్‌ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ‘మనం హిట్ కొట్టామ్ బ్రో.. నాగార్జున గారిని ఎంతో యంగ్‌గా చూపించావ్.. కంగ్రాట్స్ బ్రదర్' అంటూ ట్వీట్లు చేస్తున్నారు. అంతేకాదు, ‘బ్రో.. నీకు మామూలు టాలెంట్ లేదు.. నిన్ను తక్కువ అంచనా వేసిన వాళ్లకు ఫడేల్ ఫడేల్' అని కొందరు కొనియాడుతున్నారు. అలాగే, సంగీతం విషయానికొస్తే ఒక పాట బాగుందని, మిగిలినవి అంతగా అనిపించలేదని పేర్కొంటున్నారు. అలాగే, బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా అంత ఎఫెక్టివ్‌గా లేదని చెబుతున్నారు.

వెన్నెల కిశోర్ - నాగ్ సీక్వెన్స్

సినిమా చూసిన వాళ్లంతా ఇందులో వెన్నెల కిశోర్ - నాగార్జున మధ్యలో వచ్చే సీక్వెన్స్‌ సూపర్ ఉందని అంటున్నారు. సినిమా ప్రారంభమైనప్పటి నుంచి ఎండ్ అయ్యే వరకు వీళ్లిద్దరూ కనిపిస్తే పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతారని చెబుతున్నారు. ముఖ్యంగా కొన్ని సీన్లకైతే సీట్లలో కూడా కూర్చేలేరని పేర్కొంటున్నారు.

నాగ్ - రకుల్ కెమిస్ట్రీ

ఈ సినిమాలో రకుల్ నటిస్తుందని తెలిసినప్పటి నుంచి అందరిలో ఆమె నాగార్జున వంటి సీనియర్ హీరో పక్కన సెట్ అవుతుందా..? అన్న అనుమానం కలిగింది. కానీ, ఈ సినిమా చూసిన తర్వాత అది నిజం కాదని తేలిపోయిందని అంటున్నారు. నాగార్జున యంగ్‌గా కనిపించడం వల్ల వాళ్లిద్దరి జోడీ కన్విన్సింగ్‌గా ఉందని చెబుతున్నారు. రకుల్ కూడా ఎంతో అందంగా కనిపించిందని, గతంలో ఎన్నడూ లేనంతగా నటించిందని సినిమా చూసిన వారు అభిప్రాయ పడుతున్నారు. మొత్తంగా వీళ్లిద్దరి మధ్య వచ్చే సీన్స్ వర్కౌట్ అయ్యాయన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

సినిమాపై అభిప్రాయాలు

‘మన్మథుడు 2' చూసిన వారంతా పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తున్నారు. అయితే, ఫస్టాఫ్ ఫుల్ ఎంటర్‌టైనర్‌గా సాగిన ఈ సినిమా.. సెకెండాఫ్ మాత్రం సాగదీతగా అనిపించిందన్న అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా కొన్ని ఎమోషనల్ సీన్స్ మాత్రం బాగున్నాయని అంటున్నారు. మొత్తంగా ఈ సినిమా అక్కినేని అభిమానులకు పండుగలా ఉంటుదని ట్వీట్లు చూస్తే అర్థం అవుతోంది.

‘మన్మథుడు 2’ గురించి..

‘మన్మథుడు 2’ గురించి..

అక్కినేని నాగార్జున - రకుల్ ప్రీత్ సింగ్ కాంబినేషన్‌లో రాహుల్ రవీంద్రన్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘మన్మథుడు 2'. మనం ఎంటర్‌ ప్రైజెస్‌, ఆనంది ఆర్ట్స్‌, వయకామ్‌ 18 స్టూడియోస్‌ పతాకాలపై నాగార్జున అక్కినేని, పీ కిరణ్‌ (జెమిని కిరణ్‌) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో లక్ష్మి, వెన్నెలకిషోర్‌, రావు రమేష్‌, ఝాన్సీ, దేవదర్శిని తదితరులు నటించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X