Don't Miss!
- Sports Navjot Singh Sidhu: సచిన్ కాదు.. టీమిండియా అత్యుత్తమ బ్యాటర్ అతనే!
- Lifestyle శ్రీ కృష్ణుడు గోపికలతో మొదలై హోలీ పండగ గురించి ఆసక్తికరమైన విషయాలు.!
- Automobiles ఆటోమేటిక్ గేర్ vs మాన్యువల్ ట్రాన్స్మిషన్.. వీటిలో ఏది బెస్ట్.?.. మనోళ్లు ఎక్కువగా వీటినే కొంటున్నారు.!!
- News ప్రధాని మోదీ ఎదుటే కాలు మీద కాలు వేసుకుని కూర్చొన్న టీడీపీ ఎమ్మెల్యే.. తరువాత రియాక్షన్ ఏమిటంటే..?
- Technology సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ హై రిస్క్ అలెర్ట్.. ఈ ఫోన్లలో భద్రతా లోపాలు.. అప్డేట్ చేయకుంటే..??
- Travel దేశంలో ఒక్కోచోట ఒక్కోలా రంగుల హోలీ జరుపుతారని మీకు తెలుసా?!
- Finance Market Crash: సెన్సెక్స్-నిఫ్టీ నేల చూపులు.. నిండా ముంచిన ఐటీ స్టాక్స్..
రకుల్ ప్రీత్‌పై నాగార్జున అసంతృప్తి.. వార్నింగ్.. మన్మథుడు2 డైరెక్టర్ క్లారిటీ
Recommended Video
టాలీవుడ్లో 2002లో త్రివిక్రమ్ శ్రీనివాస్, నాగార్జున కాంబినేషన్లో తెరకెక్కిన మన్మథుడు చిత్రం ఎంతటి భారీ విజయాన్ని అందుకున్నదో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆ క్రేజీ సినిమాకు సీక్వెల్‌గా మన్మథుడు 2 సినిమా రూపుదిద్దుకొంటున్నది. ఈ చిత్రంలో నాగార్జున సరసన అందాల తార రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటిస్తున్నది. రకుల్ ప్రీత్ సింగ్ లుక్‌పై నాగార్జున అసంతృప్తిని వ్యక్తం చేశాడంట. ఆ విషయం మీడియాలోనూ, సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నది. దాంతో ఆ వార్తకు వివరణ ఇచ్చేందుకు దర్శకుడు రంగంలోకి దిగారు. ఇంతకు ఏమైందంటే..
రకుల్ ప్రీత్ ఇలా ఉంటే ఎలా..
టాలీవుడ్లో ఫిట్‌నెస్‌పై అతిగా శ్రద్దచూపుతారనే అపవాదు రకుల్ ప్రీత్ సింగ్‌పై ఉంది. గతంలో బొద్దుగా చూడగానే ఆకట్టుకొనేలా ఉండేది. ఇటీవల కాలంలో మరీ సన్నబడటం నాగార్జునకు నచ్చలేదంట. నా పక్కన ఇంత పీలగా ఉంటే ఎలా ఉంటుందనే విషయాన్ని దర్శకుడితో చెప్పినట్టు ఓ వార్త విస్తృతంగా ప్రచారం అవుతున్నది. దాంతో సినిమాపై ఏదైనా ప్రభావం పడకుండా చూసేందుకు దర్శకుడు రంగంలోకి దిగాడు.
డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ ట్వీట్
నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్ విషయంపై రాహుల్ రవీంద్రన్ ట్విట్టర్లో స్పందించారు. మా సినిమాకు సంబంధించిన వార్తలు వాస్తవానికి భిన్నంగా కనిపిస్తున్నాయి. రకుల్ ప్రీత్ సింగ్ పోర్చుగీస్‌లో షూటింగ్ మాతో షూటింగ్‌లోనే ఉంది. ఆమె అందంగా, ముద్దుగా ఉండటం చూసి మేమంత హ్యాపీగా ఉన్నాం అని రాహుల్ రవీంద్రన్ ట్వీట్ చేశారు.
రకుల్ ప్రీత్ టాలెంటెడ్
రాహుల్ రవీంద్రన్ అంతటితో ఆగకుండా రకుల్ ప్రీత్‌పై మరిన్నీ ప్రశంసలు గుప్పించారు. అందంతోపాటు అభినయం కలిసి ఉన్న హీరోయిన్ దొరికినందుకు చాలా సంతోషంగా ఉన్నాం. ఆమె టాలెంట్ ఇన్క్రెడిబుల్. ఆమె పెర్ఫార్మెన్స్కు ముగ్దులమై పోయాం. రకుల్ గురించి నాగార్జున చెప్పిన విషయం మరో విధంగా ప్రొజెక్ట్ అయింది. దానిని వక్రీకరించి మీడియాలో రాశారు అని రాహుల్ రవీంద్రన్ వివరణ ఇచ్చారు.
దే దే ప్యార్ దే కోసం
తాజాగా హిందీలో రకుల్ ప్రీత్ సింగ్ నటించిన దే దే ప్యార్ దే అనే సినిమా రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. ఈ సినిమా కోసం రకుల్ ప్రీత్ నాజుక్కుగా తయారైందట. అందుకోసం ఎక్కువగా వర్కవుట్లు చేశారనేది సమాచారం. దే దే ప్యార్ దే చిత్రంలో అజయ్ దేవగన్ సరసన రకుల్ చాలా హాట్ హాట్‌గా నటించింది. ఇప్పటికే ఈ సినిమాలోని ఫోటోలు, టీజర్, వీడియో పాట వైరల్‌గా మారాయి.
మూడు భాషల్లో బిజీగా రకుల్
హిందీ, తెలుగు, తమిళ చిత్రాలతో రకుల్ ప్రీత్ సింగ్ బిజీగా ఉంది. మన్మథుడు 2లో నాగార్జున, దే దే ప్యార్ దే చిత్రంలో అజయ్ దేవగన్‌తో నటిస్తున్నది. ఇక తమిళ చిత్రం ఎన్జీకేలో సూర్యతో జతకట్టింది. సెల్వరాఘవన్ దర్శకత్వం వహిస్తున్న ఎన్జీకేలో సాయిపల్లవి మరో హీరోయిన్. ఆగస్టు నెలలో ఈ చిత్రం విడుదల కానున్నది.