Don't Miss!
- Lifestyle చాణక్య నీతి : పొరపాటున కూడ భార్యకు ఈ 5 విషయాలు అస్సలు చెప్పకూడదు..!
- News డీజీ ఆంజనేయులు, సీపీ కాంతిరాణా టాటాపై ఈసీ బదిలీ వేటు: కీలక ఆదేశాలు
- Sports CSK vs LSG: శతక్కొట్టిన రుతురాజ్ గైక్వాడ్.. చితక్కొట్టిన శివమ్ దూబే!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్‌కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్‌మి 5G స్మార్ట్‌ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
శ్రీరామ్, సంగీత జంటగా మనోహరా..
తమిళంలో ఉయుర్గా విడుదలై సక్సెస్ సాధించిన చిత్రాన్ని తెలుగులో మనోహరా టైటిల్‌తో విడుదల చేయడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. శ్రీరామ్ (ఒకరికొకరు ఫేమ్), సంగీత ప్రధాన తారాగణంగా నటించిన ఈ చిత్రాన్ని శ్రీబాలాజీ సినీ క్రియేషన్స్ పతాకంపై ఆర్ బాలాజీ తెలుగులోకి అనువదించారు. ఈ సినిమా తొలి కాపీ సిద్ధమైందని నిర్మాత బాలాజీ తెలిపారు.
తమిళంలో ఇది వంద రోజుల చిత్రం. శంకర్ తోడల్లుడు సింగపూర్ ఆర్ శరవణ ఈ చిత్రాన్ని తమిళంలో నిర్మించారు. ప్రేమిస్తే.. చిత్రానికి శరవణ ఎగ్జిక్యుటివ్ ప్రొడ్యూసర్ కూడా. ఆటోగ్రాఫ్ చేరన్ వద్ద సహాయకునిగా పనిచేసిన సామి ఉయుర్ దర్శకుడు. శివపుత్రుడు చిత్రం తర్వాత మళ్లీ పెర్ఫార్మెన్స్కి స్కోప్ ఉన్న చిత్రంలో సంగీత అద్భుతంగా నటించింది. తెలుగులో కూడా ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారన్న నమ్మకం ఉందని నిర్మాత ఆర్ బాలాజీ వెల్లడించారు.
ప్రేమిస్తే.. చిత్రం ద్వారా పరిచయం అయిన మ్యూజిక్ డైరెక్టర్ జోషువా శ్రీధర్ ఉయుర్కి కూడా సంగీతం అందించారు. మనోహరా.. ఆడియో మార్కెట్లోకి విడుదలైందని, నవంబర్ 3న రిలీజ్‌కి ఏర్పాట్లు చేశామని నిర్మాత చెప్పారు.