twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మనోహరుడు : భారీ లొకేషన్లపైనే శంకర్ కన్ను

    By Bojja Kumar
    |

    ఇండియాలోనే గ్రేట్ ఫిల్మ్ డైరెక్టర్లలో ఒకరైన శంకర్ తాజాగా 'ఐ' అనే భారీ సినిమాకు ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని తెలుగులో 'మనోహరుడు' అనే టైటిల్ ఖరారు చేసారు. విక్రమ్ ప్రధాన పాత్రలో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని దాదాపు రూ. 70 కోట్ల భారీ బడ్జెట్‌తో ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని తన రేంజికి తగిన విధంగా భారీ లొకేషన్లలో చిత్రీకరిస్తున్నారు.

    ఇప్పటికే ఈచిత్రం తొలి షెడ్యూల్ చెన్నయ్ ప్రాంతంలో చిత్రీకరించారు. రెండో షెడ్యూల్ సెప్టెంబర్ 19 నుంచి చైనాలో ప్రారంభం కానుంది. ఇక్కడ యాక్షన్ సీన్లతో పాటు ఇతర సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. సెప్టెంబర్ 21న విక్రమ్ షూటింగులో జాయిన్ కానున్నాడు.

    సినిమా గ్రాండ్‌గా రావడానికి బెస్ట్ లొకేషన్లు ఎంపిక చేసుకున్నాడు. గతంలో శంకర్ నిర్మించిన 'జీన్స్' చిత్రంలో గ్రేట్ వాల్ ఆఫ్ చైనాతో పాటు పలు ప్రపంచ ప్రసిద్ధ లొకేషన్లు చూపించారు. తాజాగా ఐ చిత్రం కూడా వరల్డ్ బెస్ట్ ప్లేసెస్‌లో చిత్రీకరణ జరుపడానికి సన్నాహాలు చేస్తున్నారు.

    అమీ జాక్స్‌ను ఈచిత్రంలో విక్రమ్ సరసన హీరోయిన్ నటిస్తోంది. ఈ చిత్రానికి పి.సి. శ్రీరామ్ ఛాయాగ్రహణ బాధ్యతలు నిర్వహించబోతున్నారు. సాంకేతికంగా అత్యున్నత స్థాయిలో తెరకెక్కనున్న ఈ సినిమాకు 'హారీపొటర్' చిత్రానికి పనిచేసిన ఆస్ట్రేలియన్ కంపెనీ స్పెషల్ ఎఫెక్ట్స్‌ని అందించనుంది.

    'మెన్ ఇన్ బ్లాక్ ' చిత్రానికి పనిచేసిన మారీ ఓగ్ట్ ఈ చిత్రానికి కాస్టూమ్స్ డిజైనర్‌గా సేవలందించనున్నాడు. చైనాకు చెందిన ఫైట్‌మాస్టర్ పీటర్ మింగ్ ఈ చిత్రానికి పోరాట దృశ్యాలని సమకూర్చనున్నాడు. ఎ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. గతంలో శంకర్‌, విక్రమ్‌ కాంబినేషన్‌లో వ‌చ్చిన‌ అపరిచితుడు చిత్రం కమర్షియల్‌గా సూపర్‌హిట్‌ కొట్టిన సంగ‌తి తెలిసిందే.

    English summary
    
 Shankar is gearing up for yet another marathon schedule of his upcoming romantic thriller Manoharudu. The film is titled I in Tamil and it has Vikram, Amy Jackson in lead roles. The film unit is going to fly to China on September 19 and Vikram is expected to join the unit on September 21.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X