twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సీనియర్ నటుడి...యాక్టింగ్ క్లాసులు

    By Srikanya
    |

    హైదరాబాద్ : బాలీవుడ్‌ నటుడు మనోజ్‌ బాజ్‌పేయి పేరు వినగానే తెలుగులో ప్రేమకథ, హ్యాపీ, కొమరం పులి, వేదం వంటి చిత్రాలు గుర్తుకు వస్తాయి. హిందీలో సత్య, గ్యాంగ్స్‌ ఆఫ్‌ వాస్సేపూర్‌ వంటి చిత్రాల్లో నటించి ఒక విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్నారు. అయితే చాలా సంవత్సరాల తరువాత మళ్లీ ఆ రంగంలోకి పునఃప్రవేశం చేయనున్నాడు. కానీ ఈ సారి ఉపాధ్యాయుడి అవతారంలో. మనోజ్‌ బాజ్‌పేయి స్నేహితుడు ముఖేష్‌ చాబ్రా ప్రారంభించిన యాక్టింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో యాభై మంది విద్యార్థులకు పాఠాలు చెప్పనున్నాడు మనోజ్‌.

    తాను పోషించే పాత్రల్లో జీవిస్తాడని విమర్శకుల ప్రశంసలను సొంతం చేసుకున్న మనోజ్‌ తన నటనకుగానూ పలు ప్రతిష్టాత్మకమైన పురస్కారాలతోపాటు రెండు సార్లు జాతీయ అవార్డును అందుకున్నారు. బాలీవుడ్‌లో తనకంటూ ఒక స్ధానాన్ని సంపాదించుకున్న మనోజ్‌ నాటక రంగం నుంచే నటుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. రంగ స్ధలంపై ఒక నటుడిగా నటనా జీవితాన్ని ప్రారంభించిన తాను ఒక నటుడిగా నిలదొక్కుకోవడానికి ముంబయిలో అడుగుపెట్టిన తరువాత సినిమాలకే ప్రాధాన్యతనిచ్చానని అందుకే క్రమంగా రంగస్థలానికి దూరమయ్యానంటారు మనోజ్‌.

    Manoj Bajpayee conducts acting workshops after 20 years

    ప్రస్తుతం నటులుగా రాణించాలనుకునే ఔత్సాహికులకు తాను శిక్షణను ఇవ్వడం తనకు ఎంతో సంతోషంగా ఉందని, తాను ఈ రంగంలో నేర్చుకున్న కొద్దో గొప్పో కళను తరువాతి తరానికి బదిలీ చేయాలన్నదే తన ఉద్దేశమంటున్నారు. ప్రస్తుతం సినిమాల్లో నటిస్తున్న వర్ధమాన నటులు ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి మనోజ్‌ను ప్రశ్నిస్తే ఈ రోజుల్లో సినిమాల్లో పలు అవకాశాలున్నప్పటికీ అదే సమయంలో గట్టి పోటీ కూడా ఉందన్నది ఈ నటుడి అభిప్రాయం. తన యాక్టింగ్‌ వర్క్‌షాపుల్లో పాలు పంచుకునే విద్యార్థులకు నటన అనేది నిజ జీవితానికి ఏ మాత్రం భిన్నం కాదని, అది నటన అయినా, మరే పని అయినా ఏకాగ్రతతో చేయమని సలహా ఇస్తారీయన.

    English summary
    
 Two-time National award winner Manoj Bajpayee recently got a chance to revisit his past, when he conducted sessions for his friend, casting director Mukesh Chhabra's institute.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X