ఈ సినిమాకి 'సొట్టోడు' టైటిల్ ఓకేనా!??
సొట్ట బుగ్గుల ఉన్న అమ్మాయిలుంటే ఎంగో కలిసి వస్తుందని నానుడి. దీంతో హీరోయిన్ ప్రీతి జింటాకు నిలెబెల్లా సొట్టలే కావటంతో హిందీలో హీరోయిన్ గా తీసుకోవటంతో నిజంగానే ఆమె ఆకట్టుకుంది ప్రేక్షకులను. అదే విధంగా తెలుగు హీరో మంచు మనోజ్ బాబుకు కూడా సొట్ట బుగ్గలు ఉన్నాయి. మరి హీరో మనోజ్ బాబు సొట్ట బుగ్గలు అమ్మాయిలకు గిలిగింతలు పెడుతున్నాయో లేదో మాత్రం ఇంకా తెలియలేదు.
శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ పతాకంపై "ప్రయాణం" ఫేమ్ మంచు మనోజ్ హీరోగా కొత్త చిత్రం రూపుదిద్దుకుంటోంది. ప్రముఖ నటుడు మోహన్ బాబు బేనర్ పై ఇటీవల కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రం షూటింగ్ ఈ నెల 12వ తేదీన లాంఛనంగా ప్రారంభమైంది.హీరో మంచు మనోజ్‌పై తీసిన తొలిషాట్‌కు దాసరి నారాయణరావు క్లాప్ కొట్టగా, మోహన్ బాబు స్నేహితుడు పద్మభూషణ్ గ్రహీత వరప్రసాద్ రెడ్డి కెమెరా స్విచ్ఛాన్ చేశారు.
ఈ సందర్భంగా సొట్టబుగ్గల హీరో అంటూ సొట్ట సాంగ్ ఒకటి తీసారట. మరి దాంతో ఈ సొట్ట బుగ్గల చిన్నొడు ముసిముసి నవ్వులు నవ్వుతున్నాడు సొట్ట బుగ్గలు వేసుకుని సినిమాకి 'సొట్టోడు" అని పేరు పెడితే బాగుంటుంది అంటూ జోకులేస్తున్నారు సినీజనం.


Click it and Unblock the Notifications











