బాలయ్యకు దర్శకత్వం వహిస్తున్న మనోజ్
బాలకృష్ణకు మంచు మనోజ్ దర్శకత్వం వహిస్తుండటం ఏమిటి? ఆశ్చర్యంగా ఉంది కదూ. మీరు విన్నది నిజమే. అయితే ఇది కేవలం క్లైమాక్స్ ఫైట్‌కు మాత్రమే పరిమితం. మనోజ్ హీరోగా 'ఊ కొడతారా ఉలిక్కి పడతారా' చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈచిత్రంలో బాలయ్య అతిథి పాత్రలో కనిపించబోతున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన క్లైమాక్స్ యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. బాలకృష్ణ-సోనూ సూద్ మధ్య జరిగే పోరాట సన్నివేశాలకు మనోజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ విషయాన్ని మనోజ్ స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
ఈ చిత్రంలో మనోజ్ సరసన దీక్ష సేథ్ హీరోయిన్‌గా నటిస్తోంది. శేఖర్ రాజా దర్వకత్వం వహిస్తుండగా, మంచు ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై మంచు లక్ష్మి నిర్మిస్తున్నారు. బెబో శశి, సలీమ్ సులేమాన్ సంగీతం అందిస్తున్నారు. ఏప్రిల్ నెలలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
మనోజ్ నటించిన తాజా సినిమా 'మిస్టర్ నూకయ్య' చిత్రం ఈ నెల 8న విడుదలకు సిద్ధం అవుతోంది. అని కన్నెగంటి దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రాన్ని డిఎస్.రావు నిర్మిస్తున్నారు.


Click it and Unblock the Notifications











