'అల్లరి మొగుడు' చిత్రానికి 'ఝమ్మందినాదం'కీ పోలిక
అల్లుడుగారు, అల్లరి మొగుడు స్థాయిలో ఈ చిత్రం కూడా ఉంటుంది. కీరవాణి అందించిన బాణీలు ఇప్పటికే జనానికి నచ్చాయి. తెర మీద రాఘవేంద్రరావు అంకుల్ వాటిని మరింత అందంగా తీర్చిదిద్దారు. తాప్సీ అందంగా కనిపిస్తుంది. మనోజ్, డాడీల కాంబినేషన్‌లో వచ్చే సన్నివేశాలు ప్రధాన ఆకర్షణ అని చెప్తోంది మంచు లక్ష్మీ ప్రసన్న. ఆమె నిర్మాతగా రూపొందిన ఝుమ్మంది నాదం చిత్రం ఈ రోజే (జూలై 1) విడుదల అవుతోంది. మంచు మనోజ్ కుమార్, తాప్సీ(నూతన పరిచయం) కాంబినేషన్లో రూపొందిన ఈ చిత్రాన్ని కె.రాఘవేంద్రరావు నవ రస సమ్మేళనంగా రూపొందించారు. కథ ప్రకారం...బాలు(మనోజ్)ది భద్రాచలం. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి వీరాభిమాని. ఆయన పాటలంటే చెవి కోసుకుంటాడు. బాగా పాడతాడు కూడా. తన అభిమాన గాయకుడిలా పేరు తెచ్చుకోవాలని హైదరాబాద్ వస్తాడు. అక్కడ బాలుకు ఎదురైన అనుభవాలేంటి? తన లక్ష్యం ఎలా చేరుకున్నాడు..ఇలాంటి ఆసక్తికరమైన అంశాలతో కథ సాగుతుంది.


Click it and Unblock the Notifications











