twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మంచు లక్ష్మి గదిలో దొంగలు... పట్టుకున్న మనోజ్

    By Srikanya
    |

    హైదరాబాద్: మంచు లక్ష్మి ప్రస్నన గదిలో దొంగలు పడ్డారు. వారిని ఆమె సోదరుడు మంచు మనోజ్ కుమార్ పట్టుకున్నారు. ఈ విషయాన్ని ట్విట్టర్ లో తానే స్వయంగా మంచు మనోజ్ తెలియచేసారు. అయితే వారికి తాను వారితో మాట్లాడి బ్రెయిన్ వాష్ చేసానని అన్నారు. వారిని పట్టివ్వటంలో సహాయపడిన తమ కుక్కకు ధాంక్స్ చెప్పుకున్నారు.

    మంచు మనోజ్ ఈ విషయమై ట్వీట్ చేస్తూ... "మా అక్క మంచు లక్ష్మి గదిలోకి ముగ్గురు దొంగలు ప్రవేశించారు, మేం వారిని పట్టుకున్నాం.. నేను వారికి గంటకు పైగా బ్రెయిన్ వాష్ చేసాం.. తర్వాత వారిని వదిలిపెట్టమని పోలీసులకు రిక్వెస్ట్ చేసాం. వారికి గతంలో క్రిమినల్ రికార్డు ఏమీ లేదు.. వారి కుటుంబంతో మాట్లాడం... ఇప్పుడు వారు తమను తాము మార్చుకుని, తమ ఫంధాను చేంజ్ చేసుకునే అవకాసం ఇచ్చాం. వారుని క్షేమంగా వదిలేసాం. నేను మా కుక్క ఎలర్ట్ చేయటంతో దొంగలు వచ్చారని గుర్తించాం. మా కుక్క మా ప్రొటక్టర్.. మా కుక్క అంటే చాలా ఇష్టం... పోలీస్ డిపార్టమెంట్ కు కూడా వెంటనే స్పందించినందుకు ధాంక్స్" అన్నారు.

    ఇక గత సంవత్సరం మిస్టర్ నూకయ్య, ఉకొడతారా ఉలిక్కి పడతారా? చిత్రాల్లో నటించిన మంచు మనోజ్ తాజాగా 2013 సంవత్సరంలో మరో సినిమాకు కమిట్ అయ్యారు. సాయిరత్న క్రియేషన్స్ బేనర్ పై బొమ్మదేవర రామ చంద్రరావు రూపొందుతున్న ఈచిత్రం షూటింగ్ ఫిబ్రవరి నుంచి మొదలు కానుంది.

    నాగార్జున పర్సనల్ మేకప్ మేన్‌గా పని చేసిన బొమ్మదేవర రామచంద్రరావు గతంలో సాయిరత్న క్రియేషన్స్ పతాకంపై అనుష్క హీరోయిన్ గా 'పంచాక్షరి' చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రొడక్షన్ నెం.2గా తాజాగా తమ బేనర్ పై రెండో చిత్రంగా మనోజ్ తో సినిమాకు రెడీ అయ్యారు. ఈ చిత్రం గురించి నిర్మాత బొమ్మదేవర రామచంద్రరావు మాట్లాడుతూ... మనోజ్ హీరోగా భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నాము. ఈ ఫిబ్రవరి మొదటి వారంలో సినిమా ప్రారంభం కానుంది. సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో ప్రకటిస్తామని చెప్పుకొచ్చారు.

    English summary
    Manoj tweeted :“There were 3 robbers at my sister’s place, we caught them and I brain washed them for 1 hour and let them go by requesting the police. They had no criminal records in previous and we spoke to their family. Now they have a chance to correct themselves. They are safe to be out. By the way I and zues (my dog) were alone and he heard the sound first obviously, I love my dog- my protector. I thank police department for their immediate response”.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X