మనోజ్ ఆమెకు అన్నీ..
ప్రయాణం సినిమా ద్వారా పరిచయమైన హారిక..ఇప్పుడు మనోజ్ ని తెగ మెచ్చుకుంటోంది. అతనితో పనిచేయటం గొప్ప ఎక్సపీరియన్స్ అంటోంది. ముంబయిలో గతంలో యాడ్ ఫిల్మ్ లు చేసిన ఈ చిన్నదాని అసలు పేరు పాయల్ ఘోషల్. అయితే తెలుగు స్క్రీన్ కోసం ఆమె పేరు హారికగా మార్చుకుంది. అంతేగాక ఈ చిత్రంలో అందంగా కనపడటం కోసం ఆమె కొంత బరువు కూడా తగ్గింది. ఈ విషయాన్నే ఆమె ప్రస్దావిస్తూ మొదటి సినిమాకే బరువు తగ్గాలని డైరక్టర్ అడగటం ఆశ్చర్యం అనిపించినా అమలు పరిచాను. అంతే కాకుండా నన్ను కాకుండా వేరే వారిని ఆయన సినిమాలోకి తీసుకోవచ్చు. కానీ నా యాడ్స్ చూసి ఇంప్రెస్ అయ్యానని, కాన్సెప్ట్ చెప్పి నన్ను ఇంప్రెస్ చేసారు. ఆ తర్వాత ఆయన చెప్పిన దాని ప్రకారం తెరపై చేసాను. ఇక తెలుగు భాష అడ్డం కాలేదా అంటే మనోజ్ దగ్గరుండి అంతా నేర్పించాడు..హీ ఈజ్ గ్రేట్..అతను లేకుంటే ఆ సినిమా కష్టమే అని కాంప్లిమెంట్ ఇచ్చేసింది.


Click it and Unblock the Notifications











