ఆడవాళ్లను అడ్డుపెట్టుకోని డ్రామాలొద్దు..తేల్చుకొందాం రా.. విష్ణుకు మనోజ్ సవాల్
మంచు మోహన్‌బాబు కుటుంబంలో వివాదాలు రోజు రోజుకు ముదురుతూనే ఉన్నాయి. గత నెల రోజులకుపైగా విష్ణు, మనోజ్ మంచు మధ్య జరుగుతున్న మాటల యుద్ధం ప్రస్తుతం తారాస్థాయికి చేరుకొన్నది. ఇప్పటి వరకు కొట్లాటలు, పోలీసు కేసులతో అల్లాడించిన ఈ వివాదం ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా మరింత రసవత్తరంగా మారింది. ట్విట్టర్ వేదికగా విష్ణు, మనోజ్ విసురుకొంటున్న సెటైర్లు మంచు ఫ్యామిలీ ప్రతిష్టను దిగజార్చేలా చేస్తున్నదనే మాట సోషల్ మీడియాలో వినిపిస్తున్నది. మంచు సోషల్ మీడియా వార్ వివరాల్లోకి వెళితే..
మంచు ఫ్యామిలీలో ఆస్తుల వివాదం వారి ప్రతిష్టను, గౌరవాన్ని పోలీస్ స్టేషన్ మెట్లెక్కించింది. మీడియాలో కథనాలతో వారికి సమాజంలో ఉన్న మర్యాద మసకబారేలా చేసింది. పోలీసు కేసులు, కోర్టు వ్యవహారాల వివాదాలకు కొంత బ్రేక్ లభించనట్టు కనిపించింది. కానీ సంకాంత్రి తర్వాత మనోజ్ తాజాగా తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీకి వెళ్లడంతో మళ్లీ ఈ వివాదం ఉవ్వెత్తున్న రాజుకొంటున్నట్టు కనిపిస్తున్నది.

తిరుపతి సమీపంలోని మోహన్ బాబు యూనివర్సిటీలో ఉంటున్న తన తండ్రిని కలిసేందుకు మంచు మనోజ్ తన అభిమానులతో కలిసి వెళ్లారు. అయితే వారిని అక్కడి సిబ్బంది అడ్డుకోవడంతో చిన్న గలాటా జరిగింది. గేట్ వద్ద తోపులాట చోటు చేసుకొన్నది. పోలీసులు రంగ ప్రవేశం చేసి వారిపై లాఠీ ఛార్జీ చేసి అక్కడి నుంచి చెదరగొట్టే ప్రయత్నం చేశారు. అనంతరం మోహన్ బాబు, మనోజ్‌పై కేసులు నమోదు చేశారు.
ఇక తాజాగా సోషల్ మీడియాలో విష్ణు, మనోజ్ పోటాపోటీగా చేసిన పోస్టులు మరింత రచ్చగా మారాయి. వారి కామెంట్స్, సెటైర్లు వారి కుటుంబ కలహాలు బజారున పడేలా చేశాయి. సింహంలా మొరగాలని ప్రతీ కుక్కకు ఉంటుంది. కానీ విధిలో మొరగడానికి, అడవిలో మొరగడానికి తేడా ఉంటుంది. ఈ విషయం వచ్చే జన్మలో తెలుసుకొంటావని రౌడీ చిత్రంలోని డైలాగ్‌ను కోట్ చేస్తూ విష్ణు చేసిన ట్వీట్‌కు మంచు మనోజ్ ఘాటుగా రిప్లై ఇచ్చారు.
కన్నప్పలో రెబల్ స్టార్ కృష్ణంరాజు మాదిరిగా సింహం కావాలని ప్రతీ ఫ్రాడ్ కుక్కకు ఉంటుంది. ఈ విషయం నువ్వు ఇదే జన్మలో తెలుసుకొంటావు అంటూ కామెంట్ చేశాడు. విస్మిత్ (VisMith) ట్యాగ్ చేస్తూ.. ఇదేంటో కనిపెట్టండి అంటూ పోస్టులో పేర్కొన్నారు. మంచు విష్ణుకు పరోక్షంగా కౌంటర్ ఇస్తూ కామెంట్ చేయడం ఆసక్తికరంగా మారింది.
తాజాగా విస్మిత్ యూ ఆర్ టూ క్యూట్. మగాళ్లలా నువ్వు నేను ఎదురెదురుగా మనం కూర్చొని మాట్లాడుకొందాం. ఆడవాళ్లను, నాన్నను అడ్డం పెట్టుకోకు. ఈ సమస్యను తీయ్యగా పరిష్కరించుకొందాం. ఏమంటావు? విస్మిత్ మగాడిలా బిహేవ్ చేయి.. నేను ఒక్కడినే వస్తాను. నీవు ఎవరిని తెచ్చుకొంటావో తెచ్చుకో. బహిరంగంగా, ఆరోగ్యకరంగా మన సమస్యను పరిష్కరించుకొందాం.. ఇట్లు మీ కరెంట్ తీగ అంటూ మనోజ్ కామెంట్ చేశాడు. అత్తారింటికి దారేది సినిమాలో హేమ బుగ్గను బ్రహ్మానందం గిల్లే సీన్‌కు సంబంధించిన ఫోటోను ట్వీట్ చేశాడు.
#VisMith u r too cute… let’s sit and talk, Man to Man. keeping women, Dad, staff and sugar out of this. What say ?!
— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) January 18, 2025
Man up #VisMith 🙏🏼🙌🏽❤️ I promise I will come alone, u can get whomever you want or we can have an open and healthy debate 🙌🏽❤️
Yours, #CurrentTheega 😅 pic.twitter.com/9diTq9HYzA


Click it and Unblock the Notifications











