ఊ అంటావా..ఉలిక్కిపడతావా?

మోహన్ బాబు రెండో కుమారుడు మంచు మనోజ్ నేను మీకు తెలుసా చిత్రానికి ముందు చాలా గ్యాప్ తీసుకున్నారు. ఆ తర్వాత కూడా గ్యాప్ వచ్చింది. దాన్ని కవర్ చేయటానికా అన్నట్లు వరస ప్రాజెక్టులు కమిట్ అయ్యారు. వాటిల్లో యేలేటి దర్శకత్వంలో రెడీ అయిన ప్రయాణం రిలీజవుతుంది. ఆ తర్వాత జూన్ ఏడున ఓ మల్టి స్టారర్ చిత్రం వేదం ప్రారంభం కానుంది. గమ్యం దర్శకుడు క్రిష్ ఈ చిత్రాన్ని డైరక్ట్ చేస్తున్నారు. ఈ చిత్రంలో అల్లు అర్జున్, కజల్ నటిస్తారు. ఆ తర్వాత కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఓ మ్యూజికల్ చిత్రం ప్రారంభం కానుంది. ఇది ఆగస్టులో మొదలవుతుంది. ఇందులో పది పాటలు ఉంటాయి. దీనిని మంచు లక్ష్మి ప్రసన్న(సోదరి) నిర్మించనుంది. వీటి తర్వాత ఓ తమిళ చిత్రం లో నటిస్తాడు. అది ఓ తెలుగు సినిమా రీమేక్. వీటి తర్వాత కృష్ణవంశి దర్శకత్వంలో సినిమా ఉంటుంది. వీటన్నిటి తర్వాత మళ్ళీ ఏలేటి చంద్రశేఖర్ దర్శకత్వంలో మరో చిత్రం ఉంటుంది. ఇవి అన్నీ మనోజ్ స్వయంగా ప్రకటించారు.


Click it and Unblock the Notifications











