"నువ్వు నాకు తెలియదు"
నువ్వు నాకు నచ్చావ్ అన్నాడొక హీరో. మోహన్ బాబు రెండవ కుమారుడు మనోజ్ కుమార్ మాత్రం నవ్వు నాకు తెలియదు అంటున్నాడు. మనోజ్ కుమార్ తదుపరి చిత్రం పేరు నువ్వు నాకు తెలియదు. ఈ సినిమా కోసం ఆయన ఎవరికీ కనిపించకుండా వెయిట్ తగ్గించే పనిలో పడ్డాడట. కనిపిస్తే ఫోటోలు తీస్తారనే ఆయన కనిపించకుండా ఈ సినిమా కోసం కొత్తగా కనిపించాలని ఈ తాపత్రయం. ఈ సినిమా కోసం కొత్త ముఖాన్ని హీరోయిన్ గా పరిచయం చేయడానికి ప్రయత్నాలు మొదలెట్టారు. ముంబైలోనే ఈ వెదుకులాట మొదలెట్టారు. కాగా నువ్వు నాకు తెలియదు సినిమాకు అజయ్ శాస్త్రి అనే నూతన వ్యక్తి దర్శకత్వం వహించనున్నాడు. అజయ్ శాస్త్రి కృష్ణవంశీ కింద పనిచేశాడు.


Click it and Unblock the Notifications











