మనోజ్ ఇంతకీ..'ఊ కొడతారా..ఉలిక్కి పడతారా'?

By Srikanya

మంచు మనోజ్ కుమార్ ని హీరోగా ఓ కామిక్ ధ్రిల్లర్ చిత్రం మొదలవనుంది. ఊ కొడతారా..ఉలిక్కి పడతారా అనే టైటిల్ తో ప్రారంభం కానున్న ఈ చిత్రం అక్టోబర్ ఒకటినుంచి రెగ్యులర్ షూటింగ్ కి వెళ్ళే అవకాశం ఉన్నట్లు చెప్తున్నారు. కొత్త తరహా కథ, కథనంతో ఈ స్క్రిప్టు ముందుకెళ్ళనుంది. ఇక ఊ కొడతారా..ఉలిక్కి పడతారా చిత్రాన్ని మనోజ్ సోదరి లక్ష్మీ ప్రసన్న..తమ సొంత బ్యానర్ పై నిర్మించనుంది. ఈ చిత్రం గురించి మనోజ్ మాట్లాడుతూ..కృష్ణవంశీ దగ్గర అసోసియేట్‌గా పనిచేసిన రాజా దర్శకత్వంలో 'ఊకొడతారా..ఉలిక్కిపడతారా" అనే పేరుతో సంపూర్ణ హాస్య రసభరిత చిత్రాన్ని చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. కామెడీ చిత్రాల్లో సరికొత్త ప్రయోగంలా ఆ చిత్రం వుంటుంది అని అన్నారు. బిందాస్ చిత్రంతో ఓకే అనిపించుకున్న మనోజ్ తర్వాత వచ్చిన వేదంతో నటుడుగానూ ప్రూవ్ చేసుకున్నారు. మరి ఈ చిత్రంతో కమర్షియల్ హరోగా అనిపించాలని కోరుకుందాం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X