మోహన్‌బాబు కొడుకు నిర్వాకం..!

By Bojja Kumar

సినీ పరిశ్రమలో కింది స్థాయి నుంచి నటుడిగా, హీరోగా ఎదిగిన వ్యక్తుల్లో మోహన్ బాబు ఒకరు. ప్రస్తుతం మోహన్ బాబు తరం ముగిసింది. ఇతర హీరోల వారసుల్లానే మోహన్ బాబు వాసరులు కూడా తెరంగ్రేటం చేశారు. అయితే తండ్రికి తగిన వారసులుగా మాత్రం రాణించడం లేదు. మోహన్ బాబు పెద్ద కొడుకు విష్ణు హీరోగా ప్లాప్ అయ్యాడనే చెప్పాలి. అతని కెరియర్ లో 'ఢీ" సినిమా తప్ప చెప్పుకోదగ్గ విజయాలేవీ లేవు. ప్రస్తుతం దాదాపుగా నటనకు దూరమైన విష్ణు నిర్మాతగా నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నారు.

ఇక చిన్న కుమారుడు మనోజ్ ఇప్పుడిప్పుడే సినిమాల్లో రాణిస్తున్నారు. పెద్దగా హిట్లేమీ లేకున్నా అలా లాగించేస్తున్నాడు. మనోజ్ ప్రస్తుతం మిస్టర్ నోకియా అనే చిత్రంలో నటిస్తున్నాడు. అయితే డైరెక్టర్ చెప్పినట్లు వినాల్సిన మనోజ్...తనే డైరెక్టర్ కంటే ఎక్కువ ఫీలవుతూ దర్శకత్వం శాఖలో వేలు పెడుతున్నాడట. ఈ విధంగా ఈ మధ్య సినిమా యూనిట్ సభ్యులను తెగ ఇబ్బంది పెడుతున్నాడని యూనిట్ సభ్యులు అంటున్నారు. ఇందులో మనోజ్ సరసన కృతి కర్భంద నటిస్తోంది. ఇధి వరకు పవన్ కళ్యాన్ సరసన తీన్ మార్ చిత్రంలో నటించిన కృతికి పెద్దగా పేరు రాలేదు. ఈ సినిమాతోనైనా పరిశ్రమలో నిలదొక్కుకోవాలని చూస్తోంది. అయితే మనోజ్ నిర్వాకంతో సినిమా ఎక్కడ దొబ్బేస్తుందో అని మదన పడుతోందని సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X