‘పోటుగాడు’లా వెళ్లిన మనోజ్...అల్లాడిపోతున్నాడు!
పోటుగాడిలా వచ్చాను కానీ ఇక్కడ ఎండలకు అల్లాడి పోతున్నాను అంటూ మనోజ్ ట్వీట్ చేసాడు. 'బీజాపూర్ చేరుకున్నాం...ఎండలు మండిపోతున్నాయ్...నా కాస్టూమ్స్ షెర్వానీలాగా మందంగా ఉన్నాయి....40 డిగ్రీల ఎండలో ఇలాంటి దుస్తువులు వేసుకోవడం నరకమే...ఆ దేవుడే నన్ను కాపాడాలి' అంటూ మనోజ్ ట్వీట్ చేసాడు.
కన్నడ దర్శకుడు పవన్ వడెయార్ ఈచిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, లగడపాటి శ్రీధర్ ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆసక్తికర విషయం ఏమిటంటే ఈచిత్రంలో నలుగురు హీరోయిన్లు నటించబోతున్నారు. త్వరలో వారికి సంబంధించిన వివరాలు బయటకు వెల్లడికానున్నాయి.
ఊకొడతారా ఉలిక్కి పడతారా చిత్రం తర్వాత మనోజ్ చేస్తున్న సినిమా ఇదే. ఆ సినిమా బాక్సాఫీసు వద్ద బోల్తా పడటంతో స్కిప్టు ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్న మనోజ్....'పొటుగాడు' చిత్రం తనను ఇండస్ట్రీలో పోటుగాడిని చేస్తుందనే నమ్మకంతో ఉన్నాడట.


Click it and Unblock the Notifications












