ఫ్యాన్స్ దెబ్బకు అల్లాడిపోయాడు: మహేష్ బాబుకు క్షమాపణలు చెప్పిన కమెడియన్
Recommended Video

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబును అవమానించే విధంగా వ్యాఖ్యలు చేసిన తమిళ స్టాండప్ కమెడియన్ మనోజ్ ప్రభాకరన్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. స్పైడర్ మూవీలో మహేష్ బాబు ఎక్స్‌ప్రెషన్స్‌ను విమర్శిస్తూ దారుణమైన కామెంట్స్ చేశారు. బాలీవుడ్ నటి కత్రినా కైఫ్‌తో పోల్చడమే కాదు, చివరకు బండరాయితో కంపేర్ చేస్తూ అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. దీనిపై విమర్శలు రావడంతో సదరు కమెడియన్ క్షమాపణలు చెప్పడంతో పాటు, వీడియోను తొలగించారు.

మహేష్ బాబు అభిమానుల దెబ్బకు అల్లాడి పోయాడు
మనోజ్ ప్రభాకరన్ కామెంట్లతో అతడి మీద మహేష్ బాబు అభిమానులు ఎదురు దాడి ప్రారంభించారు. ఒక రకంగా చెప్పాలంటే అతడిపై మహేష్ ఫ్యాన్స్, తెలుగు సినిమా అభిమానులు ఉప్పెనలా విరుచుకుపడ్డారని చెప్పొచ్చు. దీంతో అల్లాడిపోయిన మనోజ్ ప్రభాకరన్ సోషల్ మీడియా మాధ్యమాల తన వీడియో తొలగించారు.

క్షమాపణలు చెప్పాడు
మహేష్ బాబు మీద తాను చేసిన కామెంట్లపై మనోజ్ ప్రభాకరన్ క్షమాపణలు చెప్పారు. కేవలం తన కామెడీ షో కోసమే ఇలాంటి వ్యాఖ్యలు చేశానని, మహేష్ బాబును పర్సనల్‌గా టార్గెట్ చేసే ఉద్దేశ్యం లేదని తెలిపారు.

కామెడీ షో కోసం చీప్ ట్రిక్స్
తన కామెడీ షోను హైలెట్ చేసుకోవడానికే మనోజ్ ప్రభాకరన్ ఈ చీప్ ట్రిక్స్ ప్లే చేశారని, మహేష్ బాబు లాంటి ఎస్టాబ్లిష్డ్ స్టార్‌ను కావాలనే టార్గెట్ చేశాడని, తమిళనాడులో క్రమక్రమంగా తన మార్కెట్ పెంచుకుంటున్న మహేష్ బాబు ఇమేజ్ తగ్గించడానికే ఇలాంటి కామెంట్స్ చేశారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

ఎన్నో అనుమానాలు
అయితే మహేష్ అభిమానుల్లో ఈ సంఘటన తర్వాత అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తమిళనాడు సినిమా మార్గెట్లో మహేష్ బాబు ఎదుగుదలను అడ్డుకునే ప్రయత్నం కూడా అయుండొచ్చనే సందేహాలు సైతం వ్యక్తం అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











