ఎన్టీఆర్ కోసం వాడి చెయ్యి విరగ్గొట్టిన మంచు మనోజ్.. ఆ కథ ఏంటని అడిగితే!
మంచు మనోజ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎంత స్నేహంగా ఉంటారో అందరికి తెలిసిందే. ఎన్టీఆర్ ని ఎప్పుడూ మనోజ్ ప్రశంసలతో ముంచెత్తుతుంటాడు. సందర్భం వచ్చినప్పుడల్లా మనోజ్ ఎన్టీఆర్ పై తనకు ఉన్న ఇష్టాన్ని బయట పెడుతుంటాడు.మనోజ్ ప్రస్తుతం సినిమాల జోరు తగ్గించి ఆచి తూచి అడుగులు వేస్తున్నాడు. తాజగా సోషల్ మీడియాలో అభిమానులతో జరిగిన సోషల్ మీడియా చాట్ లో మనోజ్ ఆసక్తికర సమాధానాలు ఇచ్చాడు.
పోల్: బిగ్‌బాస్ తెలుగు 2 విజేతను మీరే తేల్చేయండి.. మీ ఓటు వేసేందుకు లింక్ క్లిక్ చేయండి!

ఎన్టీఆర్‌కు తోడుగా
మంచు మనోజ్ ఎప్పుడూ ఎన్టీఆర్ ని ఓ బ్రదర్ లాగా భావిస్తాడు. సందర్భం వచ్చినప్పుడల్లా ఎన్టీఆర్ కు మనోజ్ తోడుగా ఉండడం చూస్తూనే ఉన్నాం. టాలీవుడ్ లో తనకిష్టమైన వ్యక్తులు ఎవరంటే మనోజ్ మొదట చెప్పేది ఎన్టీఆర్ పేరే.

హరికృష్ణ మరణించిన సమయంలో
నందమూరి హరికృష్ణ మరణించిన సమయంలో మంచు మనోజ్ దగ్గరే ఉండి ఎన్టీఆర్ ని ఓదార్చాడు. అంత్యక్రియల సమయంలో కూడా ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ కు మనోజ్ బాడీ గార్డ్ గా మారిన దృశ్యాలు చూశాం. సోషల్ మీడియాలో మనోజ్ అభిమానులతో ముచ్చటిస్తుండగా ఓ అభిమాని నుంచి ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది.
వాడి చెయ్యి విరగొట్టారా
చిన్న వయసులో ఎన్టీఆర్ ని ఎవరో కొడితే వాడి చెయ్యి విరట్టారట కదా. ఆ స్టోరీ కొంచెం చెప్పండి అని ఓ అభిమాని మనోజ్ ని అడిగాడు. దానికి మనోజ్ నవ్వుతూ.. ఆ స్టోరీని నాకంటే తారక్ బాగా చెబుతాడు. ఈ ప్రశ్న అతడినే అడగండి అని మనోజ్ బదులిచ్చాడు.

పెళ్లి సందడిలో ఉన్న శ్రీకాంతే
అభిమానులతో ముచ్చటిస్తున సందర్భంగానే ఆపరేషన్ 2019 మూవీ గురించి మనోజ్ మాట్లాడాడు. ఈ చిత్రంలో చిన్న కామియో రోల్ లో నటిస్తున్నానని తెలిపాడు. శ్రీకాంత్ గారి కోసమే ఆ గెస్ట్ రోల్ చేస్తున్నా. ఆయన చాలా మంచి వ్యక్తి. చిన్నప్పటి నుంచి చూస్తున్నా. పెళ్లి సందడి చిత్రంలో ఎలా ఉన్నారో ఇప్పటికి అలాగే ఉన్నాడని మనోజ్ ప్రశంసించాడు.


Click it and Unblock the Notifications











