బెస్ట్ ఆఫ్ లక్ వీరూ పోట్ల
మంచు మనోజ్ హీరోగా ప్రముఖ రచయిత వీరూపోట్ల దర్శకత్వంలో రూపొందనున్న చిత్రం పూజా కార్యక్రమాలతో ఈ రోజు ప్రారంభమైంది. నానక్ రామ్ గూడ రామానాయుడు స్టూడియోస్ లో ప్రారంభమైన ఈ చిత్రం ద్వారా షీనా అనే ముంబయి ముద్దుగుమ్మ హీరోయిన్ గా పరిచయం అవుతోంది. ఇక దాసరి ఈ చిత్రానికి క్లాప్ కొడితే, కె.రాఘవేంద్రరావు స్విఛ్చాన్ చేసారు. మోహన్ బాబు మొదటి షాట్ ని డైరక్ట్ చేసారు. పరుచూరి బ్రదర్శ్, ఎమ్.ఎస్.రాజు కలసి స్క్రిప్టుని దర్శకుడుకి అందించాడు.
ఈ సందర్బంగా దర్శకుడుగా పరిచయమవుతున్న వీరూ పోట్ల మాట్లాడుతూ గత రెండేళ్ళుగా నా కల ఫలించబోతుందన్నారు.అలాగే చిత్రం ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని, నిర్మాత సుంబర అనీల్ కి స్క్రీన్ ప్లే పై మంచి గ్రిప్ ఉందని,ఈ సినిమా స్క్రిప్టు రెడీ చేసేటప్పుడు అతను సజెషన్స్ బాగా పనిచేసాయని చెప్పుకొచ్చారు. అలాగే ఈ ప్రాజెక్టు తెరకెక్కించటానికి మంచి టీమ్ దొరికిందని నమ్మకాన్ని వ్యక్తం చేసారు. అలాగే ఈ చిత్రంలో మనోజ్ పాత్ర అతని నిజ జీవితానికి బాగా దగ్గరగా ఉంటుందన్నారు. ఈ నెల 12 నుంచి షూటింగ్ ప్రారంభమవుతున్నారు.
పురుచూరి బ్రదర్స్ శిష్యుడైన వీరు పోట్ల నువ్వు వస్తానంటే నేవద్దంటానా, వర్షం చిత్రాలకు కథ, సంతోషం చిత్రానికి మూల కథ అందించారు. ఎమ్.ఎస్.రాజు బ్యానర్ లో వచ్చిన మనసంతా నువ్వే చిత్రంకు కథా సహకారం అందించారు. గతంలో లగడపాటి శ్రీధర్ తమ బ్యానర్ పై వీరుతో సినిమా ప్రారంభించారు. కానీ అనివార్య కారణాల వల్ల అది ముందుకు వెళ్ళలేదు. ఇక ఈ చిత్రానికి అజయ్ గాడి విజయ గా ధ అనే టైటిల్ పెట్టే అవకాశం ఉందని సమాచారం. బెస్టాఫ్ లక్ వీరు పోట్ల.


Click it and Unblock the Notifications











