చిరంజీవిపై 20 కోట్ల పరువు నష్టం కేసు.. త్రిషా, కుష్బూలకు షాకిచ్చిన మన్సూర్ ఆలీ ఖాన్
తమిళ పరిశ్రమలో త్రిష, మన్సూర్ ఆలీ ఖాన్ మధ్య వివాదం ఉధృతంగా మారి ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి, సీనియర్ నటి కుష్బూ మెడకు చుట్టుకొనేలా కనిపిస్తున్నది. త్రిషపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై కుష్బూ, చిరంజీవి తదితరులు స్పందించడంపై మన్సూర్ ఆలీ ఖాన్ తీవ్రంగా స్పందించారు. అయితే ఇటీవల మెగాస్టార్ చేసిన ట్వీట్ గురించి మన్సూర్ ఖాన్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. అయితే చిరంజీవి చేసిన ట్వీట్ కారణంగా తన పరువుకు భంగం కలిగిందంటూ పరువు నష్టం దావా వేసేందుకు సిద్దమవుతున్నారు. ఈ వివాదం వివరాల్లోకి వెళితే..
ఇటీవల విజయ్ నటించిన లియో సినిమాలో మన్సూర్ ఆలీ ఖాన్ నటించారు. అయితే ఈ సినిమాలో త్రిష ఉందని చెప్పినప్పుడు.. గతంలో సీనియర్ హీరోయిన్ల సినిమాల్లో వారితో బెడ్ రూమ్‌లో నాకు రేప్ సీన్లు ఉండేవి. ఈ సినిమాలో కూడా త్రిషను బెడ్ రూమ్‌లో రేప్ చేయాల్సి ఉంటుందని అనుకొన్నాను. కానీ అలాంటి ఛాన్స్ దక్కలేదు అని మన్సూర్ ఆలీ ఖాన్ అన్నట్టు వీడియోలు వైరల్ అయ్యాయి. అయితే కొందరు చేసిన ఎడిటింగ్ వల్ల త్రిషనే రేప్ చేయాలనిపించింది అనే అలా ప్రొజెక్ట్ అయ్యింది.

అయితే త్రిషను మన్సూర్ ఆలీ ఖాన్ రేప్ చేస్తానని అన్నాడనే వ్యవహారంపై పలువురు స్పందించారు. అయితే తాను అలా అనలేదు. నా వ్యాఖ్యలను కొందరు వక్రీకరించారు. ఇంటర్వ్యూలో నేను అలా మాట్లాడలేదు అని ఆయన వివరణ ఇచ్చారు. అయినా మన్సూర్ ఆలీ ఖాన్‌పై విమర్శల దాడి ఆగలేకపోవడం వల్ల వివాదం మరింత ముదిరింది.
ఇటీవల త్రిష, మన్సూర్ ఆలీ ఖాన్ వ్యవహారంపై చిరంజీవి స్పందించారు. త్రిషను అలా అనుకుండా ఉండాల్సింది. మన్సూర్ అలీ ఖాన్ వ్యవహరించిన తీరు బాగాలేదు. త్రిషకు మన్సూర్ ఆలీ ఖాన్ సారీ చెప్పాలని విధంగా చిరంజీవి ట్వీట్ చేశాడు. అయితే చిరంజీవి వస్తవాలు తెలుసుకొకుండా స్పందించారు. అసలేం జరిగిందని నన్ను అడిగి తెలుసుకొంటే బాగుండేది అని మన్సూర్ ఆలీఖాన్ స్పందించారు.

త్రిషా వ్యవహారంలో సినీ ప్రముఖులు, కుష్బు, త్రిషా, చిరంజీవి వ్యవహరించిన తీరు బాగాలేదు. తన ప్రతిష్టకు భంగం కలిగించేలా వారు వ్యవహరించారు. అందుకు గాను.. నేను కుష్బూ, త్రిషా, చిరంజీవిపై పరువు నష్టం దావా వేస్తాను. కుష్బూ, త్రిషాపై 10 కోట్ల రూపాయలు, చిరంజీవిపై 20 కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేస్తాను అని మన్సూర్ ఆలీ ఖాన్ తమిళ మీడియాలో పేర్కొన్నట్టు వార్తలు వస్తున్నాయి.
అయితే త్రిష, కుష్బూ, చిరంజీవి వేసే పరువు నష్టం దావా నుంచి 40 కోట్ల రూపాయలు పేద ప్రజలకు పంచి పెడుతాను. తమిళనాడులో లిక్కర్ తాగి మరణించిన కుటుంబాలకు ఆ మొత్తాన్ని డొనేట్ చేస్తానని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో ఈ వివాదం ఇక్కడే ఆగుతుందా? లేదా మరింత దూరం వెళ్తుందా అనేది వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











