మెగా ఫ్యాన్ నుండి మెగా ప్రొడ్యూసర్ గా...

అయితే అతి కొద్ది సమయంలోనే తన పెట్టబడితో సహా అంతా పోగొట్టుకున్నారు. అలాంటి స్ధితిలో తన కజిన్ బ్రదర్ రామ్ గోపాల్ వర్మని కలిసారు ..ఏదన్నా పని ఇప్పించమని అడిగారు. అయితే అప్పుడు వర్మ ..బాలివుడ్ లో ఉన్నారు.ఆయన పని కూడా అప్పుడు పెద్దగా బాగోలేదు. రోడ్ సినిమా తీస్తున్నారు.అయినా ఆయన మధుని తన సినిమాకు మార్కెటింగ్ ఇన్ ఛార్జ్ గా ఉండమన్నారు. సినిమాల మార్కెటింగ్ గురించి అసలేమి తెలియనికి హిందీ మాట్లాడంటం కూడా రాదు. అయినా ధైర్యంగానే ముంబయి బయిలుదేరారు. అక్కడ ప్రయత్నించి... మొదట టాటా సఫారి వారిని కన్సల్ట్ చేసి రోడ్ సినిమాకు డీల్ సంపాదించారు. ఈ ఎకనామిల్ సపోర్ట్ సినిమాకు చాలా బాగా ఉపయోగడింది.
అక్కడ నుంచి వర్మ ప్రతీ సినిమాకూ వర్క్ చేస్తూ వచ్చారు. అనంతరం సర్కార్ ప్రీమియర్ అప్పడు ఆయన దశ తిరిగింది. రిలియన్స్ యాడ్ లాబ్స్ వారు మధుని చూసి తమ సినిమాల ఓవర్ సీస్ పంపిణి బిజెనెస్ చూడమని అప్పగించారు. అప్పుడు వారి క్రిష్ రిలీజయింది. దానికి ఎన్నడూ లేని విధంగా పదహారు కోట్లు ఓవర్ సీస్ మార్కెట్ సంపాదించి యాడ్ లాబ్స్ లో రికార్డ్ సృష్టించారు. ఆ తర్వాత గజనీ ప్రపోజల్ పెట్టడం పెద్ద హిట్టవడం ఆయనకు చాలా సంతోషాన్నిస్తోంది. కంగ్రాట్స్ మంతెన మధుగారు...


Click it and Unblock the Notifications











