చార్మితో మళ్లీ మంత్ర డైరక్టర్...
మంత్రతో పరిచయమైన దర్శకుడు తులసీరామ్ తన తరువాత చిత్రానికి కూడా ఛార్మినే ఎంపిక చేసుకున్నారు. 'మంగళ' అనే టైటిల్ తో ఈ చిత్రం రూపొందనుంది. ఇక ఈ చిత్రం కూడా హర్రర్ గానే తయారుకానున్నట్లు చెప్తున్నారు. అయితే మంత్రకు సీక్వెల్ మాత్రం కాదని అంటున్నారు. అలాగే తులసీరామ్ ఇంతకాలం ఎమ్.ఎస్.రాజు క్యాంపస్ లో ఉన్నారు. ఆయన సినిమా ఇస్తారని వెయిట్ చేసినట్లు చెప్తున్నారు. ఆయన తన కుమారుడుని హీరోగా పరిచయం చేసే భాద్యతను అప్పగించాలనుకుని ఎందుకనో మనస్సు మార్చుకున్నట్లు వినపడుతోంది. అందులోనూ ఎమ్.ఎస్.రాజు ప్రస్తుతం కోడి రామకృష్ణ దర్శకత్వంలో చండీ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు. కాజల్ హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రాన్ని మరో అరుంధతిలా మార్చేలనే పట్టుదలతో శ్రమిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పరిస్ధితుల్లో తులసీరామ్ బయిటకు వచ్చి అప్పటికీ ఫేడవుట్ అయి అవకాశాలు కోసం చూస్తున్న ఛార్మితో సినిమా ప్రకటించటం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఛార్మి మాత్రం ఈ చిత్రం తిరిగి తనకు సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్టయినంతగా ఫీలవుతోంది. ఎందుకంటే మంత్ర ద్వారానే చార్మి ఉత్తమ నటిగా నంది అవార్డును సైతం అందుకొంది. ఇక 'మంగళ' పూర్తి వివరాలు త్వరలో వెల్లడవుతాయి.


Click it and Unblock the Notifications











