హీరోయిన్ గా జయమాల తనయ సౌందర్య
కన్నడ ప్రభాకర్ - నటి జయమాల తనయ సౌందర్య కథానాయికగా తెరకు పరిచయం కానుందనే వార్తలు వినిపిస్తున్నాయి. 19 యేళ్ళ సౌందర్య ముంబయ్ లోని రోషన్ తనేజా యాక్టింగ్ స్కూల్లో నటనకు సంబంధించిన శిక్షణ తీసుకుందట. సౌందర్యను మలయాళ, తెలుగు చిత్రాల నిర్మాతలు హీరోయిన్ గా నటింపజేయటానికి ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం.
కన్నడంలో రాజకుమార్ తనయుడు పునీగ్ రాజ్ కుమార్ హీరోగా నటించే సినిమాలో సౌందర్య కథానాయికగా కెరియర్ ని ప్రారంభిస్తుందని తెలుస్తోంది. అంతేకాకుండా తెలుగులో 'ఉల్లాసంగా ఉత్సాహంగా' చిత్రం గత ఏడాది మంచి విజయం సాధించింది. కరుణాకరన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ద్వారా యశోసాగర్ హీరోగా పరిచయమయ్యారు. తాజాగా యశోసాగర్ కథానాయకుడుగా రెండవ చిత్రాన్ని అమృత్ అమర్ నాథ్ ఆర్ట్స్ సంస్థ ప్రకటించింది. ఈ చిత్రంలో కన్నడ ప్రభాకర్ - జయమాల దంపతుల కుమార్తె సౌందర్యను హీరోయిన్ గా పరిచయం చేస్తున్నామని చెప్పారు. ఇదిలా ఉంటే నటి జయమాల మాట్లాడుతూ - 'మా అమ్మాయిని కథానాయికగా నటింపజేయటానికి పలువురు ఆసక్తి చూపుతున్న విషయం నిజమే కానీ నేను ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు" అని చెప్పింది.


Click it and Unblock the Notifications











