చిరు మేనల్లుడి సినిమా కష్టాలు...రాస్తే ఓ పుస్తకమే
చిరంజీవి మేనల్లుడు సాయి ధరమ్ తేజ హీరోగా ప్రముఖ దర్శకుడు వైవిఎస్ చౌదరి 'రేయ్' అనే చిత్రం రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రారంభమై సంవత్సరం గడిచి పోయింది. అయితే ఇప్పటి వరకు సినిమా కనీసం సగం కూడా పూర్తి కాలేదు. దీంతో గత కొన్ని రోజులుగా ఈ సినిమా గురించి ఎలాంటి చర్చ కూడా మీడియాలో లేకుండా పోయింది.
ఈ విషయమై ఇటీవల చౌదరిని ప్రశ్నిస్తే...కొన్ని సమస్యల వల్ల సినిమా పూర్తి కాలేదు. ఆ సమస్యల గురించి రాస్తే ఓ పెద్ద పుస్తకం తయారవుతుందన్నారు. ఇప్పుడిప్పుడే ఆ సమస్యల నుంచి అధిగమనించామని, త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తామని తెలిపారు. వేసవికల్లా సినిమా ప్రేక్షకుల ముందుకు తెచ్చే ఆలోచనలో ఉన్నట్లు వెల్లడించారు.
వైవిఎస్ చౌదరి ప్రస్తుతం రవితేజ హీరోగా రూపొందుతున్న 'నిప్పు' చిత్రాన్నికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 2న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











