twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఈ కులంలో పుట్టడం తప్పా? నేను చాలా కోల్పోయా: కమెడియన్ పృథ్వి

    కమెడియన్ పృథ్విరాజ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో కులాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

    By Bojja Kumar
    |

    'ఖడ్గం' సినిమాలో 30 ఇయర్స్ డైలాగ్‌తో పాపులర్ అయిన కమెడియన్ పృథ్విరాజ్ ప్రస్తుతం టాలీవుడ్లో వరుస అవకాశాలు దక్కించుకుంటూ దూసుకెలుతున్నారు. తన సినిమాల గురించి, ఇండస్ట్రీ గురించి మాట్లాడేందుకు తరచూ ఇంటర్వ్యూస్ ఇచ్చే పృథ్వి తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో అగ్రకులాల్లో ఆర్థికంగా వెనకబడిన వారి గురించి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి.

    కృష్ణ‌గారు చేయమంటే చేశా, తర్వాత ఎన్టీఆర్ కాళ్ల మీదపడ్డా...కమెడియన్ పృధ్వికృష్ణ‌గారు చేయమంటే చేశా, తర్వాత ఎన్టీఆర్ కాళ్ల మీదపడ్డా...కమెడియన్ పృధ్వి

    Recommended Video

    Balakrishna Warning To C Kalyan @Garuda Vega Trailer Launch

    తాను అగ్రకులానికి చెందిన వాడిని అని, తమ కులం ఓసీ కేటగిరీలో ఉండటం వల్ల చాలా నష్టపోయానని ఆయన చెప్పుకొచ్చారు. తనలా నష్టపోయిన వారు లక్షల్లో ఉన్నారని, ఈ కులంలో పుట్టడం తప్పా? అని బాధ పడ్డవారూ ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు.

     డీఎస్పీ, ఎస్పీ అయ్యేవాడిని

    డీఎస్పీ, ఎస్పీ అయ్యేవాడిని

    ఓసీ అవడం వల్లనే తనకు పోలీస్ ఉద్యోగం రాలేదని, వచ్చిఉంటే ఎప్పుడో డీఎస్పీ అయ్యేవాడినని, ఆ తర్వాత ఏ మంత్రి దగ్గరో చేరి భజన లేదా మరోదో చేసినా ఇప్పటికి ఎస్పీ కూడా అయిపోయేవాడిని అని, తనలా అవకాశాలు కోల్పోయిన వారు లక్షల్లో ఉన్నారని కమెడియన్ పృథ్వి చెప్పుకొచ్చారు.

     90 శాతం మంది చితికిపోయిన వారే

    90 శాతం మంది చితికిపోయిన వారే

    ఓసీల్లో ఒక లక్ష మందిలో పదివేల మంది మాత్రమే ఆర్థికంగా బలంగా ఉండి, బ్రహ్మాండంగా బ్రతుకుతున్నారని, మిగతా 90 శాతం మంది ఆర్థికంగా చితికిపోయి చాలా కష్టపడుతున్నారని పృథ్వి చెప్పుకొచ్చారు.

    కావాల్సింది కులం కిరీటాలు కాదు

    కావాల్సింది కులం కిరీటాలు కాదు

    ‘ఏమండీ, నాయుడు గారు' అని పిలిస్తే.. ‘నమస్తే అండి' అనడం, ‘ఒరేయ్, పది కాఫీలు చెప్పు' అని పురమాయించడం.. కావాల్సింది ఇలాంటి కిరీటాలు కాదు. ఆర్థికంగా మెరుగుపడటం కావాలి. మంచి బట్టలు వేసుకుని పైకి బ్రహ్మాండంగా కనపడతాం కానీ, జేబులో వంద కూడా ఉండనిపరిస్థితిలో చాలా మంది ఉన్నారని పృథ్వి తెలిపారు.

     ఆర్థికంగా వెనుకబడిన వాళ్లందరినీ గుర్తించమని కోరుతున్నా

    ఆర్థికంగా వెనుకబడిన వాళ్లందరినీ గుర్తించమని కోరుతున్నా

    ఇక్కడ నేను మాట్లాడేదాంట్లో ప్రధాన ఉద్దేశ్యం.... ఆర్థికంగా వెనుకబడిన వాళ్లందరినీ గుర్తించమని కోరుతున్నా. నేను వర్గీకరణను తప్పుబట్టడం లేదు. వర్గీకరణలను గౌరవిస్తాం, అందరం ఒక కుటుంబంలా ఉందామనదే తన అభిప్రాయమని పృథ్వి తెలిపారు.

     నిలదీసే రోజు ఒకటి వస్తుంది

    నిలదీసే రోజు ఒకటి వస్తుంది

    ఓసీల్లో ఆర్థికంగా వెనుకబడిన వాళ్లకు ఏం చేస్తారో చెప్పండి, లేకపోతే, మా గ్రామంలో అడుగుపెట్టొద్దు' అంటూ రాజకీయనాయకులను నిలదీసేరోజు వస్తుంది' అని ఈ సందర్భంగా పృథ్వీ వ్యాఖ్యానించారు.

    English summary
    "Many of the upper caste people are suffering financially. I think I have lost the police job because I was in oc category." comedian prudhvi said.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X