రామ్ చరణ్ చిత్రం ప్రమోషన్ బాధ్యత కూడా ఆమె పైనే
న్యూఢిల్లీ: అక్రమ ఆయుధాలు కలిగిఉన్నాడన్న కేసులో జైలు పాలైన సంజయ్‌దత్ నటించిన పోలీస్ గిరి చిత్రం క్రితం శుక్రవారం విడుదలైంది. చిత్రం ప్రచార బాధ్యతలను చిత్ర హీరో మోస్తున్న ప్రస్తుత తరుణంలో ఈ చిత్రం హీరో జైల్లో ఉండడంతో నిర్మాతలు భారీగానే నష్టపోవాల్సి వస్తోంది. దీంతో పోలీస్ గిరి చిత్రానికి తగినంత ప్రచారాన్ని మాన్యతతో తీసుకురావాలని నిర్మాతలు భావిస్తున్నారు. అందుకే సినిమా గురించి రోజూ ఏదో ప్రకటన ఉండేలా మాన్యతతో మాట్లాడిస్తున్నారు.
పోలీస్‌గిరీ చిత్రాన్ని కూడా పిల్లలతో కలిసి చూసిన మాన్యత ఆ చిత్రానికి కూడా తగినంత ప్రచారాన్ని కల్పించడంలో తనవంతు పాత్రను పోషిస్తోంది. ఇవేకాకుండా సంజయ్ నటించిన మరికొన్ని చిత్రాలు కూడా త్వరలో విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అందులో టాలీవుడ్ హీరో రామ్‌చరణ్ తేజ నటించిన 'జంజీర్' చిత్రంలో సంజయ్ షేర్‌ఖాన్ పాత్రలో కనిపించనున్నాడు. మరి ఈ చిత్రానికి కూడా తగినంత ప్రచారాన్ని కల్పించాల్సిన బాధ్యత కూడా మాన్యతపైనే మోపుతారేమో అంటున్నారు బాలీవుడ్ సినిమా జనం.
మాన్యత 'జంజీర్' గురించి మాట్లాడుతూ.. " ప్రోమోలు చాలా బాగున్నాయి..రామ్ చరణ్ మంచి యాక్టర్. అపూర్వ లఖియా..మంచి డైరక్టర్. ఆయన గతంలో సంజూతో షూట్ ఎట్ లోకండ్ వాలా తీసారు. మళ్లీ ఈ చిత్రం తీసారు. ఆయన మా కుటుంబంలో వ్యక్తి లాంటివారు. సంజు చాలా బాగా కనిపిస్తున్నారు. ఈ సినిమాలో నటుడుగా ఎవాల్వ్ అయ్యాడు ," అని చెప్పుకొచ్చింది.


Click it and Unblock the Notifications











