జైల్లో సంజయ్ దత్‌ని కలిసిన మాన్యత
పూణె : 1993 బాంబు పేలుళ్ల కేసులో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ పూణెలోని ఎరవాడ జైలులో గడుపుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన భార్య మాన్యత దత్ ఇద్దరు పిల్లలతో కలిసి జైలుకు వచ్చాయి. ములాఖత్ సమయంలో సంజయ్‌ని కలిసారు. ఈ సందర్భంగా మాన్యత కాస్త ఉద్వేగానికి గురై కంటతడి పెట్టినట్లు తెలుస్తోంది.
జైల్లో ఉన్నప్పటికీ కుటుంబ సభ్యులతో రోజూ టచ్ లో ఉంటున్నాడు సంజయ్. జైల్లో ఫోను వాడటం నిషేదం కాబట్టి....ప్రతి రోజూ తన భార్య మాన్యతకు ఉత్తరం రాస్తున్నాడట. మాన్యత కూడా భర్తకు రోజూ క్రమం తప్పకుండా ఉత్తరం రాస్తోందట. ముంబై పాలిహిల్ లోని నర్గీస్ రోడ్ ఇంపీరియల్ హైట్స్ అపార్టుమెంట్ 11వ అంతస్తులో సంజయ్ నివాసం. ప్రస్తుతం ఆ ఇంట్లో ఆయన భార్య, పిల్లలు ఉంటున్నారు. సంజయ్ నివాసానికి ప్రతి రోజూ పోస్టుమెన్ చక్కర్లు కొడుతుండటంతో అనుమానం వచ్చిన మీడియా వారు ఆరా తీగా ఈ విషయం బయట పడింది.
మాన్యతకు సంజయ్ దత్‌తో 2002లో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు సంతానం. ఎంతో అన్యోన్య దంపతులుగా పేరు తెచ్చుకున్నారు. సంజయ్ జైలు పాలవ్వడంతో ఆయన కుటుంబం ఒంటరి తనం అనుభవిస్తోంది. ఆలోటును పూడ్చేందుకు రోజూ భార్యకు ఉత్తరాలు రాస్తున్నాడట సంజయ్ దత్. ఉత్తరాలు రాయడంతో పాటు సంజయ్‌ని నెలలో ఎన్నిసార్లు కలిసే అవకాశం ఉంటే అన్ని సార్లు వెళ్లి కలిసి వస్తోందట మాన్యత. 42 నెలల పాటు సంజయ్ దత్ జైలు శిక్ష అనుభవించాల్సి ఉంది. మరి ఇంత కాలం సంజూభాయ్ కుటుంబానికి దూరంగా ఎలా గడుపుతాడో ఏంటో..!
కాగా, 1993 అల్లర్ల కేసులో అరెస్టై పుణేలోని ఎరవాడ జైలులో ఉన్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్‌కు అధికారులు 16656 నంబరు కేటాయించిన విషయం తెలిసిందే. ఆయన ఎరవాడ జైలుకు రావడం ఇది మూడోసారి. ఆయనను మూడో నంబరు గదిలో ఉంచారు. ఆయన బ్యారక్ చుట్టూ చాలా చెట్లతో ప్రశాంతమైన వాతావరణం ఉంటుందని జైలు అధికారులు చెప్పారు.


Click it and Unblock the Notifications












