»   » శ్రీలంకలో సూపర్ స్టార్ భార్య వెకేషన్, ఇంత సెక్సీగా బికినీలోనా..అంతా షాక్ (ఫొటోలు)

శ్రీలంకలో సూపర్ స్టార్ భార్య వెకేషన్, ఇంత సెక్సీగా బికినీలోనా..అంతా షాక్ (ఫొటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: మనదేశంలో ఇక్కడ ఉన్నంతకాలం ఓ రకంగా ఉంటారు మన సెలబ్రెటీలు. అదే దేశం దాటారా...వారి పద్దతే మారిపోతుంది. వారు డ్రస్సింగ్ స్టైల్ నుంచి మార్చేసుకుంటారు. అఫ్ కోర్స్ వేరే చోట ప్రశాంతంగా ఎలాంటి ఇనిహిబిషన్స్ లేకుండా ఎంజాయ్ చేస్తూంటారు.

ముఖ్యంగా ఇది బాలీవుడ్ లో ఎక్కువ. కాస్త రిలీఫ్ దొరికితే ఫ్యామిలీతో కలిసి అందరూ ఏ దీవులకో చెక్కేస్తారు. అక్కడ పూర్తి స్దాయిలో రిలీఫ్ అవుతూంటారు. అదీ చాలా కాలం నుంచి ఉన్నది కానీ..రీసెంట్ కాలంలో సోషల్ మీడియా వినియోగం బాగా పెరిగిపోయాక, ఆ ఫొటోలు బయిటకు వచ్చి అభిమానులను అలరిస్తున్నాయి.

తాజాగా బాలీవుడ్ సూపర్ స్టార్ సంజయ్ దత్ ...జైలు నుంచి బయిటకు వచ్చాక, తన ఫ్యామిలీతో పిల్లలతో ఎంజాయ్ చేస్తున్నారు. సంజయ్ దత్ టాంజీనియాలో ఉన్నారు. అలాగే ఆయన భార్య పిల్లలు శ్రీలంకలో ఉన్నారు. ఆ ఫొటోలు మీరు ఇక్కడ చూడవచ్చు.

రిచా శర్మ మరణం తర్వాత సంజయ్ దత్ 1998లో మోడల్ రియా పిళ్లైని రెండో వివాహం చేసుకున్నారు. ఈ ఇద్దరూ 2005లో మనస్పర్థల కారణంగా విడిపోయారు. అనంతరం 2008లో నటి మాన్యతను మూడో వివాహం చేసుకున్నారు. సంజయ్, మాన్యత దంపతులకు ఇద్దరు సంతానం.

చూడండి ఎంత బాగా

చూడండి ఎంత బాగా

సంజయ్ దత్ భార్య మాన్యత, పిల్లలు చూడండి ఎంత హ్యాపీగా లోకాన్ని మరిచి ఎంజాయ్ చేస్తున్నారో. ఇలా ఎప్పుడో కానీ కుదరదు. పిల్లలతో హ్యాపీ మూడ్ లో ఉన్నారు. సంజయ్ దత్ ఈ ఫొటోలు చూసి ఎంతగానే మురిసిపోతున్నాడు.

ఫుల్ గా ఎంజాయ్

ఫుల్ గా ఎంజాయ్

ఎంజాయ్ రాజా ఎంజాయ్ అన్నట్లుగా సంజయ్ దత్ ఫ్యామిలీ ఇలా శ్రీలంకలో ఎంజాయ్ చేస్తోంది. చాలా హ్యాపీ మూడ్ లో ఉన్నారు వీళ్లు. పిల్లల ఆనందం చూసి సంజయ్ దత్ తెగ ఆనందపడుతున్నారట. ఈ ఫొటోలను ఆయన చూసుకుని హ్యాపీ ఫీలవతున్నారట.

ఏదో చూపెడుతూంటే

ఏదో చూపెడుతూంటే

తల్లి ఏదో చూపెడుతూంటే పిల్లలిద్దరూ ఎంతో ముచ్చటగా తల్లి చూపించిన వైపే చూస్తున్నారు. సంజయ్ దత్ జైలు నుంచి బయిటకు రావటంతో వారు ఇప్పుడు చాలా హ్యాపీగా, ఫ్రీగా ఉన్నారు. తల్లి, పిల్లలు కలిసి సెలబ్రేట్ చేసుకుంటున్నారు.

సత్ర్పవర్తన క్రింద

సత్ర్పవర్తన క్రింద

1993 ముంబై బాంబు పేలుళ్లు, అక్రమాయుధాల కేసులో జైలుశిక్ష అనుభవిస్తున్న బాలీవుడ్ హీరో సంజయ్‌దత్ ఫిబ్రవరిలో 25 న జైలు నుంచి బయటకువచ్చాడు. నిజానికి సంజయ్ దత్ కు ఐదేళ్ల జైలుశిక్ష పడగా.. సత్ప్రవర్తన క్రింద ప్రభుత్వం కొంత శిక్షాకాలాన్ని తగ్గించింది. దీంతో సంజయ్ విడుదలకు లైన్ క్లియరైంది.

ఫ్యామిలీ ఫుల్ ఖుష్

ఫ్యామిలీ ఫుల్ ఖుష్

సంజయ్ దత్ విడుదల సందర్భంగా జైలు వద్ద అతని భార్య మాన్యత, పిల్లలు, ఇతర కుటుంబ సభ్యులు స్వాగతం పలికారు. దేశ వ్యాప్తంగా అభిమానులు ఆనందోత్సాహాలలో వున్నారు. సంజయ్ దత్ విడుదలను పురస్కరించుకుని ఎవరికివారు తోచిన రీతిలో ఆనందాన్ని పంచుకుంటున్నారు. సంజయ్ దత్ అభిమాని తన హోటల్ లో కస్టమర్లకు బిర్యాని ఫ్రీగా పెట్టి తన అభిమానాన్ని చాటుకున్నాడు.

ఓ పిటీషన్ వేసారు

ఓ పిటీషన్ వేసారు

సంజయ్ దత్ విడుదలై కొన్ని గంటలు కూడా గడవకముందే, ఇంతలోనే ఈ హీరో విడుదలపై కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి. జైలు శిక్షాకాలంలో సెలబ్రిటీ ఖైదీ అయిన సంజయ్ అధికారుల మాటను దిక్కరించాడంటూ ప్రదీప్ భాలేకర్ అనే వ్యక్తి విడుదలను నిలిపివేయాలంటూ బొంబాయి హైకోర్టులో ఓ పిటీషన్ దాఖలు చేశారు. సంజయ్ ముంబై ఆర్థర్ రోడ్డు జైల్లో ఉన్నప్పుడు జైలు యూనిఫాం వేసుకోవలసి ఉండగా, అతను ససేమీరా అనే సరికి అధికారులు ఆయన పట్ల కఠినంగానే వ్యవహరించామని మహారాష్ట్ర జైళ్ల శాఖ డీఐజీ స్వాతి సాథె చెప్పారు.

ఫోన్ వాడకూడదు కాబట్టి

ఫోన్ వాడకూడదు కాబట్టి

జైల్లో ఉన్నప్పటికీ కుటుంబ సభ్యులతో రోజూ టచ్ లో ఉంటున్నాడు సంజయ్. జైల్లో ఫోను వాడటం నిషేదం కాబట్టి....ప్రతి రోజూ తన భార్య మాన్యతకు ఉత్తరం రాస్తున్నాడట. మాన్యత కూడా భర్తకు రోజూ క్రమం తప్పకుండా ఉత్తరం రాసింది.

పోస్ట్ మ్యాన్ ని పట్టుకుని

పోస్ట్ మ్యాన్ ని పట్టుకుని

ముంబై పాలిహిల్ లోని నర్గీస్ రోడ్‌ ఇంపీరియల్ హైట్స్ అపార్టుమెంట్ 11వ అంతస్తులో సంజయ్ నివాసం. ప్రస్తుతం ఆ ఇంట్లో ఆయన భార్య, పిల్లలు ఉంటున్నారు. సంజయ్ నివాసానికి ప్రతి రోజూ పోస్టుమెన్ చక్కర్లు కొడుతుండటంతో అనుమానం వచ్చిన మీడియా వారు ఆరా తీగా ఈ విషయం బయట పడింది.

అప్పుడు ఒంటిరితనం

అప్పుడు ఒంటిరితనం

మాన్యతకు సంజయ్ దత్‌తో 2002లో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు సంతానం. ఎంతో అన్యోన్య దంపతులుగా పేరు తెచ్చుకున్నారు. సంజయ్ జైలు పాలవ్వడంతో ఆయన కుటుంబం ఒంటరి తనం అనుభవించింది. ఆలోటును పూడ్చేందుకు రోజూ భార్యకు ఉత్తరాలు రాసాడు సంజయ్ దత్. ఉత్తరాలు రాయడంతో పాటు సంజయ్‌ని నెలలో ఎన్నిసార్లు కలిసే అవకాశం ఉంటే అన్ని సార్లు వెళ్లి కలిసి వస్తోంది మాన్యత.

ఇది మూడో సారి

ఇది మూడో సారి

1993 అల్లర్ల కేసులో అరెస్టై పుణేలోని ఎరవాడ జైలులో ఉన్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్‌కు అధికారులు 16656 నంబరు కేటాయించిన విషయం తెలిసిందే. ఆయన ఎరవాడ జైలుకు రావడం ఇది మూడోసారి. ఆయనను మూడో నంబరు గదిలో ఉంచారు. ఆయన బ్యారక్ చుట్టూ చాలా చెట్లతో ప్రశాంతమైన వాతావరణం ఉంటుందని జైలు అధికారులు చెప్పారు.

English summary
Manyata and Sanjay are spending some real quality time with their family out of India. Sanjay Dutt's wife and kids are enjoying vacation in Srilanka and Sanjay Dutt in Tanzania, see their pics.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu