»   » ఆమె ఎలా చనిపోయింది?? డాన్స్ చేస్తూనే కనుమూసిన 44 యేళ్ళ మరాఠీ నటి అశ్విని

ఆమె ఎలా చనిపోయింది?? డాన్స్ చేస్తూనే కనుమూసిన 44 యేళ్ళ మరాఠీ నటి అశ్విని

Posted By:
Subscribe to Filmibeat Telugu

మరీ పెద్ద వయసేం కాదు 44 ఏళ్ళ నటి ఆమె అంతే కాదు ప్రఖ్యాత నృత్య కారిణి కూడా.. స్టేజ్ పై ఆమె నాటయం చేస్తూనే కుప్పకూలేసరికి అభిమానులంతా అలా నిలబడిపోయరు..., ఇక తమ అభిమాన నటి తిరిగి లేవలేదని తెలిసి వారి గుండెలు పగిలిపోయాయి. భారతీయ సాంప్రదాయ నృత్యం తోనే కాదు ఒక సినీ నటిగా కూడా అశ్వినీ ఎక్బోటే కొన్ని దశాబ్దాలుగా మరాఠీ సినిమాల్లో ఒక వెలుగు వెలిగారు. అసలింతకీ ఏం జరిగింది... అప్పటివరకూ నవ్వుతూ నవ్విస్తూ ఉన్న ఆమె స్టేజ్ పైనే ఎనుకు కుప్పకూలి పోయారు... కొన్ని క్షణాల్లోనే ఆమె ఎలా మరణించారు... ఇప్పుడు మరాఠీ ప్రేక్షకులనేకాదు... భారత దేశం మొత్తం లోనూ క్లాసికల్ డాన్స్ ని ఇష్టపస్డే వారందరికీ తెలిసిన అశ్విని అభిమానులనీ వేదిస్తున్న ప్రశ్న ఇది....

Marathi actor Ashwini Ekbote dies during performance

పూణేలోని భరతనాట్యమందిర్ లో డాన్స్ పర్ఫార్మెన్స్ ఇస్తున్న ప్రముఖ క్లాసికల్ డాన్సర్ - మరాఠీ నటి అశ్విని ఎక్బోటే సడెన్ గా హార్ట్ ఎటాక్ రావడంతో స్టేజ్ మీదే కుప్పకూలిపోయారు. దాంతో కంగారు పడిన అక్కడివారంతా ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు. కానీ దురదృష్టవసాత్తు ఆమె అప్పటికే కళతోనే - కళలోనే తుదిశ్వాస విడిచారు. డాక్టర్లు చెప్పిన మాట హార్ట్ ఎటాక్ అని అప్పటికే ఆమెకు ఆ విశయం తెలిసినా డాన్స్ ని వదల్లేక నే అలానే కొనసాగిస్తూ వచ్చారనీ.., గత కొన్నాళ్ళుగా ఆమె హృద్రోగ సమస్యలని ఎదుర్కొంటున్నా ఆమెకి కళ మీద ఉన్న గౌరవం,ఇష్టం తో అలా కొన సాగుతున్నారనీ తెలిసిన ఆమె అమె అభిమానులు అక్కడే రోదించటం అందరినీ కదిలించింది... అశ్వినీ ఇక మళ్ళీ కనిపించదన్న నిజం మరాఠీ చిత్ర పరిశ్రమని దిగ్బ్రాంతికి గురిచేసింది.

Marathi actor Ashwini Ekbote dies during performance

ఈ నెల 22న పుణెలో ఓ వేదికపై నృత్య ప్రదర్శన ఇస్తుండగా ఆమె గుండెపోటుకు గురయ్యారు. ఆమెను హుటాహుటిన గోరె హాస్పిటల్‌కు తరలించారు. అనంతరం ఆమె మరణించినట్టు వైద్యులు ప్రకటించారు. ఆమె మరాఠీలో వెండితెరపై తన పాత్రలతో చెరగని ముద్రవేశారు. దుహేరీ, రాధా హై బవారి, దుర్వా వంటి పలు టీవీ షోలలో ఆమె నటించారు. దేబు, దన్యావర్ దంకా, తప్తపది వంటి ప్రాంతీయ సినిమాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. మహిళా సాధికారత వంటి కార్యక్రమాల్లోనూ ఆమె పాల్గొన్నారు.

English summary
Ashwini Ekbote died in the middle of a performance on Saturday as her friends and family watched. The 44-year-old suffered a cardiac arrest during the closing act of programme.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu