»   » సినీ నటిపై గ్యాంగ్ రేప్, చేసింది దర్శకుడి ఫ్రెండే...

సినీ నటిపై గ్యాంగ్ రేప్, చేసింది దర్శకుడి ఫ్రెండే...

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: ఓ మరాఠీ సినీ నటిపై ఐదుగురు వ్యక్తులు గ్యాంగ్ రేప్ చేసిన సంఘటన మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. నిందితుల్లో పోలీసులు ఒకరిని అరెస్టు చేసారు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం దర్శకుడి స్నేహితుడే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. ప్రధాన నిందితుడు చిట్లాంగేను పోలీసులు అదుపులోకి తీసుకోగా మరో నలుగురు పరారీలో ఉన్నారు.

Marathi actress gang-raped

సినిమా షూటింగ్ కోసం పైఠాన్ అనే ఊరికి వెళ్లిన ఆమె రెండు నెలల పాటు అక్కడే ఉంది. ఆదివారం తన డబ్బు తీసుకోడానికి ఔరంగాబాద్ కు వచ్చింది. దర్శకుడి స్నేహితుడి వద్దకు తన పారితోషికం కోసం వెళ్లగా, అతడు ఆమెను అక్కడి నుంచి దాదాపు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న పైఠాన్ వద్దకు తీసుకెళ్లి, అక్కడ మరో నలుగురితో కలిసి సామూహిక అత్యాచారం చేశారని ఔరంగాబాద్ క్రైం బ్రాంచి ఇన్ స్పెక్టర్ కంచన్ కుమార్ చెప్పారు.

ఆనంద్ మఘాడే అనే డైరెక్టర్ తన స్నేహితుడైన గోవింద్ చిట్లాంగేకు సినిమా కోసం ఓ హీరోయిన్ కావాలని చెప్పాడు. దాంతో ముంబైకి చెందిన ఆ అమ్మాయిని ఎంపిక చేసి, రెండు నెలల పాటు షూటింగ్ చేశారు. అయితే ఆమెకు డబ్బులు మాత్రం ఇవ్వలేదు. తన డబ్బుల గురించి గోవింద్ చిట్లాంగేను సంప్రదించగా, అతడు ఆమెను నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి అక్కడ మరో నలుగురితో కలిసి సామూహిక అత్యాచారం చేసినట్లు పోలీసులు చెప్పారు.

English summary
A small-time Marathi film actress was allegedly gang-raped by five persons in Paithan tehsil here and one person has been arrested in this connection, police said on Tuesday.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu