వీడియో లీక్ చేస్తానని బెదిరింపు.. 15 లక్షలతో దుబాయ్‌కి.. హీరోయిన్ అరెస్ట్

మరాఠీ హీరోయిన్ సారా శ్రవణ్‌ అలియాస్ సారా సోనేవానేను పుణే క్రైమ్‌బ్రాంచ్ పోలీసులు ముంబైలో అరెస్ట్ చేశారు. బలవంతపు వసూళ్లు, బెదిరింపులకు పాల్పడిన ఆరోపణలపై నమోదైన కేసులో సారాను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. గత కొద్దికాలంగా తప్పించు తిరుగుతున్న ఈ హీరోయిన్‌ను వల పన్ని అరెస్ట్ చేయడంతో బాలీవుడ్, మరాఠీ సినీ పరిశ్రమలో సంచలనం రేపింది. సారా శ్రవణ్‌ అరెస్ట్‌కు సంబంధించిన మరింత సమాచారం ఏమిటంటే..

 బలవంతపు వసూళ్లతో

బలవంతపు వసూళ్లతో

బలవంతపు వసూళ్లకు పాల్పడిన కేసులో మొత్తం ముగ్గురు మరాఠీ సినిమా పరిశ్రమకు సంబంధించిన స్టార్లతోపాటు ఓ పోలీసు అధికారి కూడా ఉన్నారు. ఈ కేసులో సారాది నాలుగో అరెస్ట్ కావడం గమనార్హం. దాదాపు మొత్తం 15 లక్షలు మేర బలవంతపు వసూళ్లకు పాల్పడినట్టు, అంతేకాకుండా కొందరిని బెదిరించినట్టు కూడా ఫిర్యాదులు వచ్చాయి. దాంతో కేసు నమోదు చేసి మహారాష్ట్ర పోలీసులు రంగంలోకి దిగారు.

గుట్టు చప్పుడు కాకుండా దుబాయ్‌కి

గుట్టు చప్పుడు కాకుండా దుబాయ్‌కి

తనపై బలవంతపు వసూళ్లకు సంబంధించిన కేసు నమోదు కావడంతో హీరోయిన్ సారా పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్నారు. అంతేకాకుండా గుట్టుచప్పుడు కాకుండా దుబాయ్ చెక్కేయడంతో ఆమె అరెస్ట్‌కు పలు విధాలుగా ప్రయత్నించారు. గత ఏడు నెలల నుంచి ఆమె భారత్ రాక కోసం ఎదురు చూశారు. ఇటీవల ముంబైలో అడుగుపెట్టిందనే విషయం తెలుసుకొని వల పన్ని సారాను అరెస్ట్ చేశారు.

బాధితుడి ఫిర్యాదుతో

బాధితుడి ఫిర్యాదుతో

హీరోయిన్ సారా శ్రవణ్ కేసు గురించి పోలీసు అధికారి జయంత్ యాదవ్ మాట్లాడుతూ.. సుభాష్ యాదవ్ అనే వ్యక్తం ఈ కేసు నమోదు చేశారు. 2019 ఏప్రిల్ 10వ తేదీన ఆమెతోపాటు మరో ముగ్గురిపై కేసు నమోదు అయింది. ఏప్రిల్‌లోనే ముగ్గురి అరెస్ట్ చేశాం. ఆమె జాడ తెలియకపోవడంతో వేచి చూడాల్సి వచ్చింది. ఆమెను ముంబైలోని లోయర్ పరెల్‌లో అరెస్ట్ చేశాం అని వెల్లడించారు.

వీడియో లీక్ చేస్తానని

వీడియో లీక్ చేస్తానని

సుభాష్ యాదవ్‌తో కలిసి ఓ సినిమా చేసింది. ఆ సినిమా రిలీజ్ తర్వాత తనను లైంగిక వేధించాడని కేసు నమోదు చేసింది. తన వద్ద ఉన్న వీడియోను బయటపెడుతానని బెదిరించింది. ఓ బ్రోకర్ సహాయంతో డబ్బులు గుంజేందుకు ప్లాన్ చేసింది. ఆ క్రమంలో ఆ వీడియోను మరో యాక్టర్ లీక్ చేసింది. దాంతో వారిపై శరద్ యాదవ్ కేసు నమోదు చేయడం జరిగింది.

Recommended Video

#CineBox : Jabardasth Effect On Nandamuri Balakrishna New Movie
ముంబైలో అరెస్ట్.. పుణే కోర్టుకు

ముంబైలో అరెస్ట్.. పుణే కోర్టుకు

కాగా, సారా శ్రవణ్‌ను అరెస్ట్ తర్వాత ఆమెను పుణే పోలీసులు విచారించారు. అనంతరం పుణే కోర్టులో ప్రవేశపెట్టగా ఆమె ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా, కోర్టు దానిని తిరస్కరించింది. దాంతో ఆమెను జైలుకు తరలించారు. ఈ కేసులో వెనుక ఇంకా ఎవరి హస్తం ఉందా అనే విషయం గురించి మరింత లోతైన దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X