2010 ఆస్కార్‌కు మన హరిశ్చంద్రుడు కి ఎంట్రీ
2010 ఆస్కార్- ఉత్తమ విదేశీ భాషా చిత్రం కేటగిరీలో 'హరిశ్చంద్రాచి ఫ్యాక్టరీ'కి అధికారిక ప్రవేశం లభించింది. ఇది ఓ మరాఠీ చిత్రం.భారతీయ సినిమాకు పితామహుడైన దాదా ఫాల్కే మీద వచ్చిన చిత్రం ఇది. అలాగే గోవాలో ఈ రోజు(సోమవారం)నుంచీ ప్రారంభం అవుతున్న 40వ అంతర్జాతీయ (భారత) చలన చిత్రోత్సవంలో కూడా ఈ చిత్రాన్ని ప్రదర్శించబోతున్నారు. ఇంతవరకు మహరాష్ట్రలో తప్ప మరెక్కడా విడుదల కాని ఈ చిత్రాన్ని త్వరలోనే (బహుశా ఆస్కార్స్ వేడుకల అనంతరం - 2010 మార్చి 7 తర్వాత) దేశవ్యాప్తంగా విడుదల చేయాలని పరేశ్ టీమ్ భావిస్తోంది. "ఫాల్కే అవార్డు గొప్పదని మాత్రమే ఈ తరానికి తెలుసు. ఫాల్కే ఎంత గొప్పవాడో తెలియజెప్పడానికి నేనే చిత్రం తీశాను' అంటున్నారు పరేశ్ మొకాషి. దర్శకుడిగా ఆయనకు తొలి చిత.ఆయన ఇంతకుముందు నాటకాలను డైరక్టే చేస్తూండేవాడు.ఇక తొలి భారతీయ చలన చిత్రం.. 'రాజా హరిశ్చంద్ర' (1913) కాగా, ఫాల్కేపై వచ్చిన తొలి చలన చిత్రం.. 'హరిశ్చంద్రాచి ఫ్యాక్టరీ' (2009) కావటంతో అంతటా మంచి ప్రశంసలే లభిస్తున్నాయి. దాదా ఫాల్కే మీద ఏ బాషలోనూ ఒక్క సినిమా కూడా రాకపోవటంతో ఇది ఒక అపురూప ఆలోచనగా పేరు తెచ్చుకుంటోంది. ఈ చిత్రంలో ఫాల్కేగా నందు మాధవ్ నటించారు. సినిమా తీయాలనే పట్టుదలతో ఫాల్కే పడిన పాట్లే ఈ చిత్ర కథాంశం. ఫాల్కే మాట, నడక, హావభావాలు ఎలా ఉంటాయో తెలుసుకోవడం కోసం నందు మాధవ్ పుణెలోని నేషనల్ ఫిల్మ్ ఆర్కైవ్స్‌ని గాలించారు. బయోగ్రఫీలు చదివారు. ఫాల్కే, ఆయన బృందం కలిసి కెమెరాను పరీక్షిస్తున్న దృశ్యం ఒకటి ఆర్కైవ్స్‌లో లభ్యమయింది కానీ... దాని నిడివి అతి తక్కువగా, కదలిక అతి వేగంగా ఉండడంతో ఫాల్కే బాడీ లాంగ్వేజ్‌ని పట్టుకోడానికి సాధ్యం కాలేదని చెప్తున్నారు.


Click it and Unblock the Notifications











