»   » నిర్మాత ఆత్మహత్య : ప్లాప్ సినిమా, భార్య వేధింపులే కారణమా?

నిర్మాత ఆత్మహత్య : ప్లాప్ సినిమా, భార్య వేధింపులే కారణమా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: మరాఠి నిర్మాత అతుల్ తాప్కిర్(35) ముంబైలోని ఓ హోటల్ రూమల్ లో విషం తీసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదివారం తెల్లవారుఝామున ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ఆత్మహత్యకు ముందు అతుల్ ఫేస్ బుక్ పేజీలో... తాను ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిందో వెల్లడించారు.

సినిమా నిర్మాణంలో తీవ్రంగా నష్టపోవడంతో పాటు కుటుంబ కలహాలు కూడా కారణమని ఆయన ఫేస్ బుక్ పోస్టును బట్టి తెలుస్తోంది. ముఖ్యంగా అతుల్ తన భార్య గురించి ప్రత్యేకంగా పేర్కొనడం గమనార్హం.

సినిమా నిర్మాణంలో నష్టాలు

సినిమా నిర్మాణంలో నష్టాలు

అతుల్ తాప్కిర్ మరాఠీలో ‘డోల్‌ తాశే ' అనే సినిమాను నిర్మించాడు. అయితే ఈ సినిమా తనకు మంచి గుర్తింపు తెచ్చినప్పటికీ ఆర్థికంగా తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చిందని సదరు నిర్మాత తన ఫేస్ బుక్ పోస్టులో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు.

నాకు అండగా నిలిచారు

నాకు అండగా నిలిచారు

సినిమా వల్ల నష్టపోయి చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్న తనకు తన తండ్రి, సోదరి చాలా సోపోర్టుగా నిలిచారని అతుల్ తాప్కిర్ ఆత్మహత్యకు ముందు ఫేస్ బుక్ లో పేర్కొన్నారు.

నా భార్య వేధించింది

నా భార్య వేధించింది

నష్టాల పాలై క్లిష్టపరిస్థితుల్లో ఉన్న తనను భార్య వేధింపులకు గురి చేసిందని, ఆమె సోదరులు కూడా తనను వేధించారని పేర్కొన్నారని.... అతుల్ తాప్కిర్ ఆత్మహత్య వెనక అసలు కారణాలు ఏమిటనే విషయమై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

ఇలా చేస్తాడనుకోలేదు

ఇలా చేస్తాడనుకోలేదు

ఢోల్ తాశే మూవీ సహ నిర్మాత మాట్లాడుతూ... అతుల్ ఎప్పుడూ నవ్వుతూ ఉండేవాడు, అలాంటి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడని తెలిసి షాకయ్యాను. మానసిక ఆందోళనలో ఉన్నట్లు ఎప్పుడూ కనిపించలేదు. సినిమా బాక్సాఫీసు వద్ద సరిగా ఆడలేదు, నష్టాలు వచ్చిన మాట నిజమే. దీని గురించి మేము మాట్లాడుకున్నపుడు ఈ నష్టాన్ని లైట్ తీసుకుని జీవితాన్ని ముందుకు సాగించాలని అనుకునే వారం...కానీ అతుల్ ఇలా చేస్తాడని అనుకోలేదని తెలిపారు.

English summary
Marathi film producer Atul Tapkir allegedly committed suicide in a hotel room in Erandwane by consuming poison in the early hours of Sunday. He was 35. In a post on his Facebook page, written sometime before his death, he wrote that he was depressed after incurring losses after producing the movie Dhol Taashe in 2015. He also wrote about the family disputes in the post.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more