రోడ్డు ప్రమాదంలో ప్రముఖ సింగర్ మృతి.. తీవ్ర గాయాలతో బయటపడిన భర్త
రోడ్డు ప్రమాదాల కారణంగా ఏటా కొన్ని లక్షల మంది మృత్యువాత పడుతున్నారు. అయితే ఈ రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా సెలెబ్రిటీలు ఉంటారు. అతి వేగం, నిర్లక్ష్యం, మద్యం సేవించి వాహనం నడపడం లాంటివి చేస్తూ రోడ్డుపై హల్‌చల్ చేస్తుంటారు. తాజాగా హీరో రాజశేఖర్ కూడా రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే.

తృటిలో తప్పించుకున్న రాజశేఖర్..
రాజశేఖర్ షూటింగ్ పూర్తి చేసుకుని రామోజీ ఫీల్మ్ సిటీ నుంచి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కారు టైర్లు బరస్ట్ అవ్వడం వల్ల డివైండర్‌ను ఢీకొట్టి మరో వైపు బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో రాజశేఖర్ చిన్న గాయాలతో బయటపడటంతో పెను ప్రమాదం తప్పింది.

రోడ్డు ప్రమాదంలో నందమూరి కుటుంబ విషాదం
నందమూరి కుటుంబానికి చెందిన జానకీరామ్, హరికృష్ణ రోడ్డు ప్రమాదంలోనే చనిపోయారన్న సంగతి తెలిసిందే. అందుకు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ప్రతీసారి తమ అభిమానులకు పదే పదే చెబుతుంటారు. నెమ్మదిగా వెళ్లండి, జాగ్రత్తగా వెళ్లండని సలహా ఇస్తుంటారు.

రోడ్డు ప్రమాదంలో మరాఠీ సింగర్
ఇలా రోడ్డు ప్రమాదంలో రోజుకు కొన్ని వందల మంది చనిపోతునే ఉన్నారు. తాజాగా చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో మరాఠీ ప్లేబ్యాక్ సింగర్ గీతామాలీ రోడ్డు ప్రమాదంలో మరణించింది. ముంబయి- ఆగ్రా హైవేపైన శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె మరణించింది.
Recommended Video

ఆగి ఉన్న ట్యాంకర్‌ను ఢీకొట్టడంతో
ఇటీవల అమెరికా నుంచి వచ్చిన ఆమె.. తమ సొంతూరైన నాసిక్ కు కారులో వెళుతున్నప్పుడు ఈ ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డు పక్కన నిలిపి ఉన్న ట్యాంకర్ ను కారు ఢీ కొట్టటంతో ఆమె మరణించింది. తీవ్రంగా గాయపడిన గీతా మాలీని ఆసుపత్రిలో చేర్చగా.. అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూసింది. భర్త తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నాడు. ఆమె మరణం పట్ల పలువురు దిగ్భాంత్రిని వ్యక్తం చేశారు.


Click it and Unblock the Notifications











