twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రేపే వస్తోంది...జీవితానికో ప్రేమలేఖ లాంటి సినిమా

    By Srikanya
    |

    ముంబై:విడుదల కాక ముందే పురస్కారాలు, ప్రశంసలు...నిజ జీవితం ఆధారంగా అల్లుకున్న కథ మార్గరీటా విత్‌ ఏ స్ట్రా. ఈ చిత్రం రేపే విడుదల అవుతోంది. ఈ చిత్రం కోసం బాలీవుడ్ మొత్తం ఎదురుచూస్తోంది.ఈ చిత్రాన్ని సోనాలి బోస్ డైరక్ట్ చేసింది.‌...2005లో ఉత్తమ ఆంగ్ల చిత్రంగా జాతీయ పురస్కారం అందుకున్న 'అము' చిత్రం తీసిందీ తనే. ఇప్పటికే అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శితమైన ఈ చిత్రం ఎన్నో పురస్కారాలు గెలుచుకుంది. ప్రతిష్ఠాత్మక టొరొంటో ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ఉత్తమ చిత్రంగా ప్రశంసలందుకుంది. 'ఈ చిత్రం జీవితానికి రాసిన ప్రేమలేఖ' అని జ్యూరీ ప్రశంసించింది.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    ఈ చిత్రంలో కథ ఇలా నడుస్తుంది.... లైలా అనే ఓ అమ్మాయి. ఆ అమ్మాయికి సెరెబ్రల్‌ పాల్సీ వ్యాధి ఉంటుంది. అదేంటంటే చిన్నవయసులోనే పక్షవాతం సోకి శరీరం చచ్చుబడిపోవడం. జీవితం అంతా వీల్‌ఛైర్‌లోనే గడపాల్సిన పరిస్థితి. అయితే ఆ అమ్మాయి తన దుస్థితికి కుంగిపోయే రకం కాదు. తన స్నేహితురాళ్లతో కలసి సరదాగా గడిపేస్తుంటుంది. చదువులో చరుగ్గా ఉండటమే కాదు యూనివర్శిటీ బ్యాండ్‌కు పాటలు కూడా రాస్తుంటుంది. ఇలా ఉండగా తనకు న్యూయార్క్‌ యూనివర్శిటీలో సీటొస్తుంది.

    Margarita with a Straw Movie releasing tomorrow

    కట్‌ చేస్తే... లైలా తన తల్లితో సహా మాన్‌హట్టన్‌ నగరంలో వాలిపోతుంది. అక్కడ ఓ అంధ విద్యార్థినితో లైలాకు స్నేహం ఏర్పడుతుంది. క్రమంగా ఆ బంధం బలపడి తనతో అత్యంత సన్నిహితంగా మెలుగుతుంటుంది. ఈ వ్యవహారం తన జీవితంలో ఎలాంటి పరిస్థితులకు దారి తీసింది? లైలాకు, తల్లికి మధ్య అనుబంధం ఎలాంటిది? లైలా తన జీవితానికి సంబంధించి ఏ నిర్ణయం తీసుకుంది? ఇవి తెలుసుకోవాలంటే 'మార్గరీటా విత్‌ ఏ స్ట్రా' సినిమా ఆడుతున్న థియేటర్‌కు వెళ్లాల్సిందే.

    ఇక సెరెబ్రల్‌ పాల్సీ బారిన పడ్డ తన సోదరి మాలిని జీవితం ఆధారంగా సోనాలీ బోస్‌ ఈ కథను రాసుకుంది. కథానాయికగా నటించిన కల్కి కొచ్లిన్‌ తన పాత్ర కోసం ఎంతో శ్రద్ధ తీసుకుంది. సెరెబ్రల్‌ పాల్సీ వ్యాధిగ్రస్తుల శరీర భాష, మాట్లాడే విధానం, దైనందిన జీవితంలో సాధారణ పనులు చేసుకోవడానికి ఎదుర్కొనే ఇబ్బందులు... ఇలాంటి విషయాలను తెలుసుకోవడానికి మాలిని జీవితాన్ని దగ్గరి నుంచి పరిశీలించింది కల్కి. చిత్రీకరణ జరిగినన్ని రోజులు కల్కి పూర్తిగా పాత్రలో లీనమై నటించిందని సోనాలి బోస్‌ ప్రశంసించింది. కల్కి కొచ్లిన్‌ తల్లి పాత్రలో సీనియర్‌ నటి రేవతి నటించారు.

    అలాగే.. టల్లిన్‌ బ్లాక్‌ నైట్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో కల్కికి ఉత్తమ నటి పురస్కారం లభించింది. ఈ చిత్రాన్ని వీక్షించిన అమితాబ్‌ బచ్చన్‌, ఆమీర్‌ ఖాన్‌ లాంటి ప్రముఖులు అద్భుత చిత్రమంటూ ప్రశంసించారు. ఇలాంటి చిత్రం ప్రేక్షకులకు చేరువకావడానికి ఎలాంటి సహకారం అందించడానికైనా సిద్ధమని ఆమీర్‌ చెప్పడం గమనార్హం.

    English summary
    Margarita with a Straw is an acting triumph. Kalki is amazing, imprisoned in a wheelchair but her spirit flying as she tastes the delights and dilemmas, from crushes to creative pushes, of a college student's life.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X