నిహారిక సినిమాకీ జనసేనకీ సంబంధం ఏమిటి?? "నాన్నకూచి" ఇదేనా..??

నిహారిక రెండో సినిమాలో హీరో ఎవరు? అనేది ఇంకా తెలిరాలేదు. అసలు ఈ చిత్రంలో హీరో ఉంటాడో? లేదో? కూడా క్లారిటీ లేదు

మెగా డాటర్ నిహారిక 'ఒక మనసు' సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయం అయిన సంగతి తెలిసిందే. తొలి సినిమా బాక్సాఫీసు వద్ద పెద్దగా వర్కౌట్ కాక పోయినా నిరహారికకు నటన పరంగా మంచి గుర్తింపే తెచ్చి పెట్టింది. చిన్న బ్రేక్ తర్వాత మళ్లీ నిహారిక రెండో సినిమా మొదలైంది. ఫిల్మ్ నగర్ టెంపుల్ లో సినిమా ప్రారంభోత్సవం జరుపుకుంది. ఈ సినిమాకు కొత్త దర్శకుడు రవి దుర్గా ప్రసాద్ దర్శకత్వం వహించబోతున్నారు.

‘జనసేన’ ట్రెజరర్

‘జనసేన’ ట్రెజరర్

ఎట్టకేలకు నిహారికకు నచ్చిన కథ దొరకడంతో ఆ కథ నిహారిక రెండవ సినిమాగా మారి పట్టాలు ఎక్కింది. అయితే ఈసినిమాకు నిర్మాణ బాధ్యతలు నిర్వహిస్తున్న రాఘవయ్య గతంలో ‘ప్రజారాజ్యం' పార్టీకి సంబంధించి పవన్ నిర్వహించిన ‘యువరాజ్యం' విభాగంలో కీలకంగా పనిచేసి ప్రస్తుతం పవన్ ‘జనసేన' ట్రెజరర్ గా ఉంటున్న వ్యక్తి.

శ్రీకాంత్ క్లాప్ కొట్టారు

శ్రీకాంత్ క్లాప్ కొట్టారు

రాఘవయ్య జ్యోతిష్యంలో కూడ మంచి అనుభవం ఉంది అని అంటారు. కొంతమంది రాజక్రీయ ప్రముఖులకు సినిమా ప్రముఖులకు ముహుర్తాలు చూసే ఈయన మరొకరి తో కలిసి ఈ ప్రాజెక్టును స్టార్ట్ చేసారు అన్న వార్తలు వస్తున్నాయి. ఫిలిమ్ నగర్ దైవ సన్నిధానంలో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఈ సినిమా ప్రారంభోత్సవం జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి హీరో శ్రీకాంత్ క్లాప్ కొట్టారు. ఈ కార్యక్రమానికి నాగ బాబు, శ్రీకాంత్, మారుతి, మెహర్ రమేష్ తదితరులు చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు.

లేడీ ఓరియెంటెడ్ మూవీ

లేడీ ఓరియెంటెడ్ మూవీ

అయితే ఈ సినిమాలో హీరో ఎవరు? అనేది ఇంకా తెలిరాలేదు. అసలు ఈ చిత్రంలో హీరో ఉంటాడో? లేదో? కూడా క్లారిటీ లేదు. కొందరేమో ఉంటాడని, మరికొందరేమో ఇది లేడీ ఓరియెంటెడ్ మూవీ అని అంటున్నారు. తమిళ యువ స్టార్ హీరో విజయ్ సేతుపతి, గౌతమ్ కార్తీక్ హీరోలుగా అరుముగ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది.

నాన్నకూచి

నాన్నకూచి

ఇందులో హీరోయిన్ గా నిహారిక నటిస్తోంది. విజయ్ సేతుపతి సరసన నటించిన హీరోయిన్లకు కోలీవుడ్ లో ప్రస్తుతం మంచి ఆఫర్లే వస్తున్నాయి. తాజాగా ఈ చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమాలు లాంచనంగా ప్రారంభమయ్యాయి. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. ఇక తెలుగులో 'నాన్నకూచి' అనే సినిమా చేస్తుందనీ, దీనిలో నాగబాఉ నటిస్తున్నారనీ అన్నారు గానీ ఇప్పుడు మొదలైన సినిమా అదేనా, లేక మరో కథా అన్నడి ఖచ్చితంగా తెలియదు మరి..

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X