మారుతీరావు ఆత్మహత్య: అమృతపై శ్రీ రెడ్డి సెన్సేషనల్ కామెంట్.. వెంటనే అలా చేయడంతో!!
సినీ ఇండస్ట్రీలో లైంగిక వేదింపులపై స్పందించి కాస్టింగ్ కౌచ్ ఉద్యమం లేవనెత్తిన శ్రీ రెడ్డి.. ఈ మధ్యకాలంలో ప్రతీ విషయంలోనూ వేలుపెడుతూ కామెంట్స్ చేస్తోంది. తన పాపులారిటీని అందిపుచ్చుకుంటూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టేస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా మారుతీరావు ఆత్మహత్య- అమృత ఇష్యూపై కూడా రియాక్ట్ అవుతూ సెన్సేషనల్ కామెంట్ చేసింది శ్రీ రెడ్డి. ఆ వివరాలేంటో చూద్దామా..
Recommended Video


అమృత- ప్రణయ్ ప్రేమ పెళ్లి.. హత్య
అమృత- ప్రణయ్ ప్రేమించి పెళ్లిచేసుకోవడం ఊహించని మలుపులకు దారితీసింది. వారిద్దరి ప్రేమ రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. ఆ ప్రేమే అమృతను, అమృత తల్లిని ఒంటరి చేసింది. అమృత తండ్రి మారుతీరావు, ఆమె భర్త ప్రణయ్‌ని అత్యంత దారుణంగా హత్య చేయించడం పెను సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.

మారుతీరావుపై కేసు.. అమృత నిందలు
ఆ తర్వాత అమృత తండ్రి మారుతీరావు పై కేసు నమోదు కావడం, కటకటాలు లెక్కపెట్టడం లాంటివి జరిగాయి. లోకమంతా ఎవరికి తోచిన విధంగా వారు మాట్లాడుకున్నారు. కొందరు అమృతను నిందిస్తే, మరికొందరు మారుతీరావును తప్పుబట్టారు. ఏదేమైనా కోట్ల ఆస్థికి వారసురాలైన అమృత మాత్రం చిన్న తనంలోనే భర్తను పోగొట్టుకుని అత్తింటికే పరిమితం అయింది.

పాపం! అమృత.. అందరూ అదే మాట
ఈ మొత్తం ఉదంతంలో కన్న తండ్రి చివరిచూపుకు కూడా నోచుకోలేకపోయిన అమృత.. లోకం దృష్టిలో మరోసారి దోషిగా నిలబడాల్సి వచ్చింది. భర్త, తండ్రి చావులకు అమృతనే కారణం అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. అందరూ ఈ మాటే అనడం ఆమె మనోవేదనను రెట్టింపు చేస్తోంది.

అమృతను ఉద్దేశిస్తూ శ్రీ రెడ్డి పోస్ట్
కాగా, మారుతీ రావు ఆత్మహత్య రెండు తెలుగు రాష్ట్రాల్లోనే గాక దేశవ్యాప్త సంచలనం కావడంతో ఈ ఇష్యూపై శ్రీ రెడ్డి స్పందించింది. 'నిన్ను చూసి సిగ్గుగా ఉంది' అంటూ అమృతను ఉద్దేశిస్తూ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ పెట్టిన శ్రీ రెడ్డి.. వెంటనే ఆ పోస్ట్ డిలీట్ చేసేసింది.

నీ పెయిన్ ఏంటో నాకు తెలుసంటూనే!!
ఆ తర్వాత రియలైజ్ అవుతూ అమృతను క్షమించమని కోరుతూ మరో పోస్ట్ పెట్టింది శ్రీ రెడ్డి. ''నీ పెయిన్ ఏంటో నాకు అర్థమైంది అమృత.. సారీ, నేను నీపై చేసిన కామెంట్‌పై రియలైజ్ అయ్యాను.. నువ్ చాలా పోగొట్టుకున్నావు. ఆ దేవుడు నిన్ను, నీ బిడ్డను దీవించాలని కోరుకుంటున్నా'' అని ఆ పోస్ట్‌లో పేర్కొంది.


Click it and Unblock the Notifications











