పవన్ కళ్యాణ్ చిన్న కొడుక్కు పేరు పెట్టాడు: చిరంజీవి పేరుకూడా కలిసేలా..
మాజీ భార్య రేణుదేశాయ్ ద్వారా పుట్టిన పిల్లలకు అకీరా నందన్, ఆద్యా అనే పేర్లు పెట్టిన పవన్, ఇప్పుడు పుట్టిన వారసుడికి ఎటువంటి పేరు పెడతారో అనే ఆసక్తిగా చూసారు.
రీసెంట్‌గా పవన్ కళ్యాణ్‌కి మరో వారసుడు జన్మించిన విషయం తెలిసిందే. పవన్, అన్న లెజ్నోవా లకు మొదటి సంతానంగా పాప పుట్టగా, రెండో సంతానంగా ఇటీవలే బాబు పుట్టాడు. పవన్ కళ్యాణ్ తన కొడుకును ఎత్తుకుని ఉన్న ఫోటో సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ అయింది. దీనిపై కొన్ని లక్షల సంఖ్యలో అభిమానులు స్పందిస్తూ విష్ చేశారు.
Recommended Video


ఎలాంటి పేరు పెడతారో
అయితే తన మాజీ భార్య రేణుదేశాయ్ ద్వారా పుట్టిన పిల్లలకు అకీరా నందన్, ఆద్యా అనే పేర్లు పెట్టిన పవన్, ఇప్పుడు పుట్టిన వారసుడికి ఎలాంటి పేరు పెడతారో అనే ఆసక్తిగా చూసారు.

సర్వత్రా ఆసక్తి
ఇది ఇలా ఉంటే పవన్ కొడుకు పేరు ఏంటన్న దానిపై సర్వత్రా ఆసక్తి రేపింది. పవన్ కళ్యాణ్ హిందూ, ఆయన భార్య అన్నా లెజెనివా క్రిస్టియన్ కావడంతో వారికి పుట్టిన బిడ్డకు ఏ సాంప్రదాయం ప్రకారం పేరు పెడతారో అంటూ రకరకాలుగా చర్చించుకున్నారు.

చిరంజీవి పేరులోని కొణిదెల
అయితే తాజాగా ఆ బాలుడికి నామకరణం చేశారు పవన్‌కళ్యాణ్. 'మార్క్ శంకర్ పవనోవిచ్ కొణిదెల' అనే పేరు పెట్టారు పవన్ దంపతులు. కాగా ఈ పేరులో పవన్‌కళ్యాణ్ అన్నయ్య చిరంజీవి పేరులోని శంకర్ కలిసేట్లుగా, తన పేరులోని పవన్ కలిసేట్లుగా నామకరణం చేయడం ఆసక్తి కలిగిస్తోంది.

అంజనా పవనోవ..
ఈ దంపతులకు మొదటి సంతానంగా పాప జన్మించగా ఆమెకు 'అంజనా పవనోవ' (పోలెనా) అని పేరు పెట్టారు. మరోపక్క పవన్, రేణూ దంపతుల పిల్లలకు అకీరా నందన్, ఆద్యా అనే పేర్లు పెట్టిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











