Don't Miss!
- News బెజవాడ దుర్గమ్మకు భారీ ఆదాయం..ఎన్నికోట్లో తెలుసా!?
- Sports SRH vs MI: ఆ కుర్రాడి వల్లే ఆల్టైమ్ రికార్డు- కమిన్స్
- Lifestyle చాణక్య నీతి ప్రకారం, ఈ తప్పులను నిర్లక్ష్యం చేసిన వారు జీవితంలో ఘోర వైఫల్యాన్ని ఎదుర్కొంటారు...!
- Automobiles కొత్త కాంపాక్ట్ ఎస్యూవీ బసాల్ట్ విజన్ ఎస్యూవీని ఆవిష్కరించిన సిట్రోయెన్
- Technology WhatsApp ద్వారా విదేశాలకు డబ్బు పంపేందుకు కొత్త ఫీచర్! వివరాలు
- Travel శివ కళ్యాణోత్సవాలకు ముస్తాబైన వేములవాడ రాజన్న ఆలయం!
- Finance Hyderabad: తల్లి కోరిక తీర్చిన ఆనంద్ మహీంద్రా.. 4000 మంది విద్యార్థుల కోసం హైదరాబాదులో..
వరుణ్ సందేశ్ మరో చరిత్ర లేటెస్ట్ ఇన్ఫో
కమల్ హాసన్ మరో చరిత్ర చిత్రాన్ని దిల్ రాజు రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. వరుణ్ సందేశ్ లీడ్ రోల్ లో చేస్తున్న ఈ చిత్రం ఆడియో డిసెంబర్ పదవ తేదీన రిలీజ్ చేస్తున్నారు. అమెరికాలోని వివిధ లొకేషన్స్ లో ఈ చిత్రాన్ని షూట్ చేస్తున్నారు. రవి యాదవ్ డైరక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్ ఇంగ్లీష్,తెలుగు కలిపి మాట్లాడుతూంటుంది. మిక్కీ.జె.మేయర్ సంగీతాన్నీ అందిస్తున్నారు. వరుణ్ సందేశ్ హీరోగా చేసిన కుర్రాడు చిత్రం (పొల్లదవాన్ రీమేక్) భాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ అయింది. అలాగే దిల్ రాజు నిర్మించిన జోష్ కూడా డిజాస్టర్ అయింది. దాంతో ఈ చిత్రాన్ని ఎలా అయినా హిట్ కొట్టాలనే పట్టుదలతో వర్క్ చేస్తున్నట్లు చెప్తున్నారు. ఇక దర్శకుడుగా పరిచయమవుతున్న రవి గతంలో పలు బాలీవుడ్ చిత్రాలకు కెమెరా అందించారు. వాటిలో ముఖ్యంగా ఐత్ రాజ్,సోఛాలతా, నఖీభ్, 36 చైనా టౌన్, రేస్ చిత్రాలు మంచి పేరు తెచ్చిపెట్టాయి. దాంతో ఈ చిత్రం కూడా విజువల్ గా మంచి స్టాండర్డ్స్ తో ఉంటుందని ఆశిస్తున్నారు.