'ప్రేమ పాతది...ప్రేమికులు కొత్తవాళ్లు'

ఇక దర్శకుడు గా రేస్ చిత్రానికి సినిమాటోగ్రఫీ ని అందించిన రవి యాదవ్ ఈ చిత్రాన్ని పరిచయమవుతున్నారు(నీలకంఠ షో చిత్రానికి కూడా ఈయన కెమెరాని అందించారు).అలాగే ఈ సినిమా ద్వారా దిల్ రాజు మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థను ప్రారంభిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందే ఈ చిత్రాన్ని తమిళంలో మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్, జెమినీ ఫిలిం సర్క్యూట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమా ద్వారా ఆయన తమిళ సినిమా రంగంలోనూ ప్రవేశిస్తున్నాను. మిక్కీ జె.మేయర్ సంగీత దర్శకత్వంలో నాలుగు పాటల రికార్డింగ్ పూర్తయింది. మరో రెండు పాటలు బ్యాలన్స్ ఉన్నాయి.
వరుణ్ సందేశ్ మాట్లాడుతూ, కమల్ హాసన్‌ను ఎంతో అభిమానించే తాను ఆయన ధరించిన పాత్రలో నటించడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. హీరోయిన్ గా పరిచయవుతున్న అనిత మాట్లాడుతూ, అమెరికాకు చెందిన తన మొదటి చిత్రం షూటింగ్ అమెరికాలో జరుగబోవడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు.


Click it and Unblock the Notifications











