»   » డబ్బులు దండగ : పెళ్లిపై సల్మాన్ ఖాన్ సంచలన కామెంట్స్!

డబ్బులు దండగ : పెళ్లిపై సల్మాన్ ఖాన్ సంచలన కామెంట్స్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ సల్మాన్ ఖాన్ 51 సంవత్సరాల వయసొచ్చినా....పెళ్లి చేసుకోకుండా అలాగే ఉండి పోవడం అభిమానులకు ఏ మాత్రం రుచించడం లేదు. వీలైనంత త్వరగా పెళ్లి చేసుకోవాలని అభిమానులు కోరుతున్నా ఆయన మాత్రం ఆ ఊసే ఎత్తడం లేదు.

ఎప్పుడైనా మీడియా వారు పెళ్లి ప్రస్తావన తెస్తే తిక్క సమాధానాలు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్న సల్మాన్ ప్రస్తుతం 'ట్యూబ్ లైట్' మూవీ ప్రమోషన్లలో పెళ్లి గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు.

పెళ్లి అనేది డబ్బులు దండగ వ్యవహారం

పెళ్లి అనేది డబ్బులు దండగ వ్యవహారం

పెళ్లి వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. పెళ్లితో డబ్బు వృథా అవుతుందే తప్పా మరెలాంటి ఉపయోగం ఉండదని సల్మాన్ ఖాన్ సంచలన కామెంట్స్ చేశారు.

ప్రేమ మీద నమ్మకం లేదు

ప్రేమ మీద నమ్మకం లేదు

‘నాకు ప్రేమపై నమ్మకమే లేదు. నేను నమ్మేది కేవలం అవసరాన్ని మాత్రమే. జీవితంలో మనకు ఎవరు అవసరమవుతారు అనేదే ముఖ్యం' అని సల్మాన్ ఖాన్ వ్యాఖ్యానించారు.

ట్యూబ్ లైట్ పగిలిపోయింది

ట్యూబ్ లైట్ పగిలిపోయింది

సల్మాన్ ఖాన్ ‘ట్యూబ్ లైట్' మూవీ బాక్సాఫీసు వద్ద ఫెయిల్యూర్ టాక్ వచ్చిన సంగతి తెలిసిందే. రివ్యూ రేటింగ్స్ కూడా చాలా తక్కువ వచ్చాయి. ఈ విషయమై సల్మాన్ ఖాన్ స్పందిస్తూ... సినిమా విమర్శకులు(క్రిటిక్స్) చాలా మంచి వారు. వారు నా సినిమాకు 3 లేదా 4 రేటింగ్ ఇస్తారని భావించాను. కానీ ఒకటి లేదా ఒకటిన్నర రేటింగ్ మాత్రమే ఇచ్చారు. అయినా నాకు గర్వంగానే ఉంది అని సల్మాన్ ఖాన్ అన్నారు.

పెద్ద ప్లాప్

పెద్ద ప్లాప్

ఈ మధ్య కాలంలో సల్మాన్ ఖాన్ సినిమాలన్నీ మంచి విజయం సాధించాయి. అయితే తానే నిర్మాతగా మారి నిర్మించిన ‘ట్యూబ్ లైట్' పెద్ద ప్లాప్ అయింది. ఫస్ట్ డే ఓపెనింగ్స్ కూడా చాలా తక్కువగా వచ్చాయి. ఈ సినిమా వల్ల సల్మాన్‌కు భారీ నష్టాలు తప్పవని అంటున్నారు.

English summary
In an interview with a leading daily, when asked about the concept of marriage. Salman Khan said, "Now, say if someone comes and asks me something straight up, like this whole marriage shit. They're really not interested, you know that. They just want to chhapo that marriage thingy. That pisses me off. For me, I think marriage is a waste of money!
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu