twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    త్వరలోనే నా పెళ్లి: గోపీచంద్

    By Srikanya
    |

    నిజ జీవితంలో'మొగుడు"కాబోతున్నారు హీరో గోపీచంద్. ఆయన ఈ విషయమై మీడియాతో మాట్లాడుతూ.. ఏ క్షణాన 'మొగుడు" టైటిల్ ఎనౌన్స్ చేశారో కానీ... అప్పట్నుంచి అందరికీ నా పెళ్లి గురించే చర్చ. నాక్కూడా పెళ్లి చేసుకోవాలని ఉంది. ఆల్రెడీ ఇంట్లో వాళ్లు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. త్వరలోనే నా పెళ్లి ఉంటుంది. ఈ లోగా నేను కట్టించుకుంటున్న ఇల్లు కూడా రెడీ అవుతుంది. కృష్ణవంశీకి పెళ్లి విషయాల్లో బాగా ఎక్సపర్ట్ కాబట్టి ఆయనే దగ్గరుండి ఎరేంజ్ మెంట్స్ చేస్తానన్నారు.. అంటూ తన ఫ్యాన్స్ కు తీపి కబురు చెప్పేసారు హీరో గోపీచంద్. ఆయన తాజా చిత్రం 'మొగుడు"ప్రమోషన్ లో కాలసిన మీడియాతో మాట్లాడుతూ ఇలా చెప్పుకొచ్చారు. అలాగే ''వరుసగా యాక్షన్ నేపథ్యమే ఎంచుకుంటే ఓ పరిధిలోనే సినిమాలు చేయాల్సివస్తుంది. నటుడు అన్నాక అన్ని రసాలూ చేయాలి. అందుకే ఏరికోరి కృష్ణవంశీ దర్శకత్వంలో 'మొగుడు" చేశాను.

    ఈ సినిమాతో కుటుంబ ప్రేక్షకులకు దగ్గర కావాలన్న నా కల నెరవేరింది"" అన్నారు. ఇక కృష్ణవంశీ దర్శకత్వంలో చేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నా. నిర్మాత బుజ్జి నా కల నెరవేర్చారు. కృష్ణవంశీతో చేయడం కొంచెం కష్టమని కొంతమంది భయపెట్టారు. కానీ ఆయన వర్కింగ్ స్టయిల్ చాలా ఈజీ అనిపించింది. తనకు కావాల్సిన ఫలితాన్ని ఏ విషయంలోనూ రాజీపడకుండా రాబట్టుకోగలుగుతారు.ఆయన్నుంచి నేను చాలా నేర్చుకున్నా. ఇందులో హీరో పాత్ర కొంచెం నా జీవితానికి దగ్గరగా ఉంటుంది. అందుకే షూటింగ్ అంతా ఎంజాయ్ చేస్తూ చేశా అని చెప్పుకొచ్చారు. త్వరలో పెళ్ళి పీటలు ఎక్కబోతున్న గోపీచంద్ కి ధట్స్ తెలుగు శుభాకాంక్షలు తెలియచేస్తోంది.

    English summary
    "My family is really keen on getting me married! They are looking for the right girl for me. In fact, director Krishna Vamsi even offered to take charge of all my wedding arrangements considering he is such an expert on marriages," quips Gopichand.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X