»   » ఈ రోజు నుంచే... ఎన్టీఆర్,సమంత పెళ్లి సీన్స్

ఈ రోజు నుంచే... ఎన్టీఆర్,సమంత పెళ్లి సీన్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్ : ఈ మధ్య సినిమాల్లో పెల్లికి సంభందించిన సీన్ లేకుండా ఉండటం లేదు. అందులో పెద్ద హీరో,హీరోయిన్ సినిమాలంటే ..తప్పకుండా పెళ్లి పాటో,సన్నివేశమో ఉండాల్సిందే. ప్రస్తుతం ఎన్టీఆర్‌ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'రామయ్యా వస్తావయ్యా' లోనూ పెళ్లికి సంభందించిన సన్నివేశం ఉంది.

ఈ రోజు (మంగళవారం) నుంచి రామోజీ ఫిల్మ్‌సిటీలోని సియేరా గార్డెన్‌, ఫ్రెండ్లీ లైన్‌ తదితర ప్రాంతాల్లో పెళ్లికి సంబంధించిన సన్నివేశాల్ని తెరకెక్కిస్తారు. ఎన్టీఆర్‌, సమంత పాల్గొంటారు. ఇదివరకు అక్కడే ఉన్న మండువా లోగిలిలో కీలక సన్నివేశాలను తెరకెక్కించారు.

రామోజీ ఫిల్మ్‌సిటీలోని ఆంధ్రాభవన్‌ పరిసరాల్లో సోమవారం వరకు కీలక సన్నివేశాల్ని తెరకెక్కించారు. ఎన్టీఆర్‌, ఇతర చిత్రబృందం చిత్రీకరణలో పాల్గొంది. ఈ సన్నివేశాలు సినిమాలో కీలకంగా వస్తాయంటున్నారు.

'భాద్‌షా' తర్వాత ఎన్టీఆర్‌, 'గబ్బర్‌సింగ్‌' తర్వాత హరీశ్‌ శంకర్‌ చేస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై అంచనాలు అంబరాన్నంటుతున్నాయి. టైటిల్‌కు అన్ని వర్గాల నుంచీ మంచి స్పందన వచ్చిందని నిర్మాత తెలిపారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ పంచ్‌ డైలాగ్స్‌, ఆయన ఎమోషనల్‌ కేరక్టర్‌ హైలైట్‌గా నిలుస్తాయని హరీశ్‌ శంకర్‌ చెప్పారు.

హరీష్ శంకర్ మాట్లాడుతూ...''ఎన్టీఆర్‌ సినిమాల్లో 'ఆది', 'సింహాద్రి' నా ఆల్‌టైమ్‌ ఫేవరేట్‌ సినిమాలు. 'రామయ్యా వస్తావయ్యా' వాటి సరసన నిలుస్తుందని ఆశిస్తున్నా'' అని అన్నారు. ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్ ...స్టూడెంట్ లీడర్ గా ఓ రేంజిలో ఫన్,ఎమోషన్ కలిగిపిన పాత్రలో అలరిస్తాడని చెప్తున్నారు.

ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ విద్యార్థి నాయకుడిగా కనిపిస్తున్నట్టు సమాచారం. సమంత, శ్రుతిహాసన్‌ హీరోయిన్స్ . హరీష్‌ శంకర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు నిర్మిస్తున్నారు.ఆగస్టు రెండోవారంలో ఈ సినిమాలోని పాటల్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

English summary
NTR’s upcoming film Ramayya Vastavayya is currently filming Marriage sequences at RFC. Recently NTR’s introduction song in the film was canned in Malaysia. Ramayya Vastavayya being produced by Dil Raju featuring Samantha as the lead actress is slated for a release in September.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu