ప్రభాస్ పెళ్లిపై లేటెస్ట్ అప్డేట్: కృష్ణం రాజు ఏమన్నారంటే...
Recommended Video

టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ ప్రభాస్. 'బాహుబలి' ప్రాజెక్ట్ తర్వాత పెళ్లి చేసుకుంటానని చెప్పిన ఈ స్టార్ మరోసారి తన పెళ్లి వాయిదా వేసుకుని నెక్ట్స్ మూవీ 'సాహో' షూటింగులో బిజీ అయిపోయారు. ప్రభాస్ లేదా ఆయన కుటుంబ సభ్యులు మీడియా కంటపడితే పెళ్లి గురించిన ప్రశ్నలే ఎదురవుతున్నాయి. తాజాగా ప్రభాస్ పెదనాన్న కృష్ణం రాజుకు ఇలాంటి పరిస్థితే ఎదురవ్వడంతో స్పందించారు.

ప్రభాస్ పెళ్లి గురించి కృష్ణం రాజు
బాహుబలి తర్వాత ప్రభాస్ పెళ్లి ఉంటుందని చెప్పారు, ఇపుడు ఎందుకు వెనక్కి వెళ్లినట్లు అనే ప్రశ్నకు కృష్ణ రాజు స్పందిస్తూ....ఈ విషయంలో తమ ప్రమేయం ఏమీ లేదని, ప్రభాస్ తనకు తానుగా ఈ విషయంలో వెనక్కి వెళ్లాడని కృష్ణం రాజు తెలిపారు.

కొన్ని సంబంధాలు షార్ట్ లిస్ట్ చేశాం
ప్రభాస్ కోసం సంబంధాలు చూస్తున్నామని, తమకు నచ్చిన కొన్ని సంబంధాలను షార్ట్ లిస్ట్ చేశామని కృష్ణం రాజు తెలిపారు. అయితే ప్రభాస్ నుండి పెళ్లి విషయంలో ఇంకా ఎలాంటి స్పందన లేదని తెలిపారు. పెళ్లి గురించి అడిగినప్పుడల్లా నా పెళ్లికి ఇంకా సమయం ఉందంటూ తప్పించుకుంటున్నాడట ఈ బాహుబలి స్టార్.

ప్రభాస్ ఓకే చెప్పడమే ఆలస్యం
ప్రభాస్ ఎప్పుడు ఓకే చెబుతాడా? అని ఫ్యామిలీ మొత్తం వెయిట్ చేస్తున్నామని, ఒకసారి ప్రభాస్ నుండి గ్రీన్ సిగ్నల్ వస్తే పెళ్లి ఏర్పాట్లు ఘనంగా చేసేందుకు కుటుంబ సభ్యులమంతా సిద్ధంగా ఉన్నామని కృష్ణం రాజు తెలిపారు.

సాహో షూటింగులో ప్రభాస్ బిజీ
ప్రస్తుతం ప్రభాస్ తన తాజా చిత్రం ‘సాహో' షూటింగులో బిజీగా గడుపుతున్నారు. సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ నటిస్తోంది. మరి ఈ సినిమా పూర్తైన తర్వాత అయినా ప్రభాస్ పెళ్లి గురించి ఓ నిర్ణయం తీసుకుంటాడో? లేదో? చూడాలి.


Click it and Unblock the Notifications











