twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సినిమా తీయగలరా అనే డౌట్ వచ్చింది.. మార్షల్ టీజర్ రిలీజ్‌లో హీరో శ్రీకాంత్

    |

    ఏవీఎల్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ పై అభ‌య్ నిర్మించిన చిత్రం మార్ష‌ల్‌. శ్రీ‌కాంత్‌, మేఘాచౌద‌రి, అభ‌య్ త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ చిత్రానికి జైరాజాసింఘ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస్‌యాద‌వ్ ముఖ్య అతిధిగా విచ్చేశారు. మెడిక‌ల్‌, యాక్ష‌న్‌సైంటిఫిక్ నేప‌థ్యంలో సాగే ఈ చిత్రం టీజ‌ర్‌ను ఆదివారం రామానాయుడు స్టూడియోస్‌లో లాంచ్ చేశారు.

    ఈ సంద‌ర్భంగా విలేక‌రుల స‌మావేశంలో...

    త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్ మాట్లాడుతూ...హీరో, నూత‌న ప్రొడ్యూస‌ర్ అభ‌య్‌కి, నూత‌న ద‌ర్శ‌కుడు జ‌య్‌కి ఈ చిత్ర యూనిట్ అంద‌రికీ ముందుగా కృత‌జ్ఞ‌త‌లు. ఎంతమంది కొత్త‌వారు వ‌స్తే అంత కొత్త క‌థ‌లు వ‌స్తాయి. కొత్త‌వారు ఇండ‌స్ట్రీకి ఎంతో అవ‌స‌ర‌ం. అభ‌య్ తీసిన మొద‌టి చిత్రంలా లేదు. ఎంతో అనుభ‌వం ఉన్న వ్య‌క్తిలా ఉన్నారు. డైరెక్ట‌ర్ ఎంత అద్భుత‌మైన సినిమా తీశారన్న‌ది టీజ‌ర్ చూస్తే తెలిసింది. జెర్సీని కూడా కొత్త ద‌ర్శ‌కుడు తీశారు చాలా బావుంది. కొత్త‌వాళ్ళు ఇండ‌స్ట్రీకి ఎంతో అవ‌స‌రం. ప్రాంతాలకు అతీతంగా ప్ర‌తిఒక్క‌రిని ఆద‌రించాలి అని అన్నారు.

     Marshal movie Teaser release by Talasani Srinivasa Yadav

    అభ‌య్ మాట్లాడుతూ... ఒక యాక్ట‌ర్‌, ప్రొడ్యూస‌ర్‌గా నేను చేసే ఈ ప్ర‌య‌త్న వెనుక ముందునుంచి నా వెన్నంటే ఉన్న మంత్రి త‌ల‌సాని గారికి ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు. శ్రీ‌కాంత్ అన్న కూడా ఈ సినిమా కోసం నా వెనకే ఉండి మంచి అండగా నిలిచి చాలా క‌ష్ట‌ప‌డ్డారు. మీరు లేక‌పోతే సినిమానే లేదు అన్న అని అన్నారు.

    జ‌య్‌రాజ్ త‌ను కేవ‌లం డైరెక్ట‌ర్‌గా కాకుండా త‌న సొంత సినిమాలాగా చేశారు. ఇక హీరోయిన్ విష‌యానికి వ‌స్తే మేఘాచౌద‌రి చాలా స్వీట్ గ‌ర్ల్‌. వెరీ హార్డ్ వ‌ర్క‌ర్ హీరోయిన్ మా యూనిట్ అంద‌రికీ కృత‌జ్ఞ‌త‌లు. సినిమా విష‌యానికి వ‌స్తే ఇది ఒక మెడిక‌ల్ యాక్ష‌న్ మూవీ. స్ట్రాంగ్ కంటెంట్ ఉంటుంది. ఈ చిత్రంలో మీరు చాలా కొత్త శ్రీ‌కాంత్ గారిని చూస్తారు. ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా క‌మ‌ర్షియ‌ల్ వాల్యూస్ ఉన్న చిత్ర‌మిది అని అభయ్ అన్నారు.

    శ్రీ‌కాంత్ మాట్లాడుతూ... త‌ల‌సానిగారు ఎప్పుడూ సినీ పరిశ్రమకు స‌పోర్ట్ చేస్తూనే ఉన్నారు. ముందుగా ఈ స్టోరీ నాకు అభ‌య్‌, జ‌య్ వ‌చ్చి చెప్పారు. నేను క‌థ విన్నాక రెండురోజులు టైం అడిగాను. ఎందుకంటే ఇది చాలా క‌మ‌ర్షియ‌ల్ మూవీ వీళ్ళు తియ్య‌గ‌ల‌రా లేదా అని అడిగాను. కానీ అభ‌య్ వ‌చ్చి నేనే ఈ చిత్రానికి ప్రొడ్యూస‌ర్ కూడా అన్నారు. అప్పుడు ఒప్పుకున్నాను. ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా చేశారు. నేను కూడా కొత్త ద‌ర్శ‌కుడుకి అవ‌కాశం ఇవ్వాలి అనుకున్నా. నాకు చెప్పిన దానికంటే ఈ సినిమాకోసం చాలానే ఖ‌ర్చుపెట్టారు. సినిమా చూశాక త‌ప్ప‌కుండా అంద‌రూ మెచ్చుకుంటారు అని అన్నారు.

     Marshal movie Teaser release by Talasani Srinivasa Yadav

    హీరోయిన్ మేఘాచౌద‌రి మాట్లాడుతూ... ఈ చిత్రంతో నేను చాలా నేర్చుకున్నాను. ఇది నాకొక మంచి ఎక్స్‌పీరియ‌న్స్ అనే చెప్పాలి. నాకు లాంగ్వేజ్ ప్రాబ్ల‌మ్ ఉన్నాకూడా మా యూనిట్‌లో ప్ర‌తిఒక్క‌రు నాకు చాలా హెల్ప్ చేశారు. అంద‌రికీ నా ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు అన్నారు.

    మ్యూజిక్ డైరెక్ట‌ర్ మాట్లాడుతూ... నేను మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా చాలా సినిమాల‌కు ప‌ని చేశారు. కానీ ఇంత పెద్ద సినిమాకి ఎప్పుడూ చెయ్య‌లేదు. నాకు ఇంత మంచి అవ‌కాశం ఇచ్చిన మా ద‌ర్శ‌క‌నిర్మాత‌ల‌కు నా ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు. మా యూనిట్ అంద‌రికీ ఆల్ ద బెస్ట్ అన్నారు.

     Marshal movie Teaser release by Talasani Srinivasa Yadav

    నటీనటులు: అభ‌య్‌, శ్రీ‌కాంత్‌, మేఘాచౌద‌రి, రేష్మిసింఘ్‌, సుమ‌న్‌, పృధ్విరాజ్‌, వినోద్‌కుమార్‌, సుద‌ర్శ‌న్‌, ర‌విప్ర‌కాష్‌, ప్రియ‌ద‌ర్శినిరామ్‌, ప్ర‌గ‌తి, శ‌ర‌ణ్య‌, క‌ల్ప‌వ‌ల్లీ త‌దిత‌రులు

    సంగీతంః యాద‌గిరివ‌రి కుప్ప‌ల‌
    ఆర్ట్‌ డైరెక్ట‌ర్ః ర‌ఘుకుల‌క‌ర్ణి
    రైట‌ర్: ప్ర‌వీణ్‌ కుమార్‌ బొట్లా,
    కొరియోగ్రాఫ‌ర్: గ‌ణేష్‌
    స్టంట్స్: న‌బా, సుబ్బు,
    బ్యాక్‌గ్రౌండ్‌స్కోర్: కె.జి.ఎఫ్‌.ర‌వి బాసుర్‌,
    ఎడిట‌ర్: చోటాకె ప్ర‌సాద్‌,
    కెమెరామ్యాన్: స్వామీ ఆర్‌.ఎం.,
    డైరెక్ట‌ర్ః జై రాజా సింఘ్‌,
    ప్రొడ్యూస‌ర్ఃఅభ‌య్ అదాక‌.

    English summary
    Hero Srikanth's Latest movie Marshal. Abhy and Megha Chowdary are the lead pair, Which directed by Jai Raj Singh. This movie teaser released by Minister Talasani Srinivasa Yadav.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X